తెలంగాణ

telangana

ETV Bharat / state

Revanth Reddy fires on KCR : 'నలుగురికి మంత్రి పదవులు ఇస్తే సామాజిక న్యాయమా..?'

Revanth Reddy fires on KCR : కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో అధికారులు స్వేచ్ఛగా విధులు నిర్వహించలేకపోతున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. మన సమాజంపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తే అడ్డుకున్న గడ్డ తెలంగాణ అని తెలిపారు. అలాంటి గడ్డలో సామాజిక న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ నలుగురికి మంత్రి పదవులు ఇవ్వడం అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

Revanth Reddy fires on KCR
Revanth Reddy fires on KCR

By

Published : Dec 3, 2022, 3:01 PM IST

Updated : Dec 3, 2022, 3:06 PM IST

Revanth Reddy fires on KCR : సమాజంపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తే అడ్డుకున్న గడ్డ తెలంగాణ అని రేవంత్ రెడ్డి అన్నారు. దుర్మార్గమైన ఆలోచనలతో వస్తేనే కొట్లాడిన గడ్డ తెలంగాణ అని తెలిపారు. తెలంగాణ అనగానే గుర్తొచ్చేది ఉస్మానియా విశ్వవిద్యాలయమని పేర్కొన్నారు. ఇక్కడ విద్యార్థుల్లో పోరాట పటిమ ఉందని అన్నారు. తెలంగాణ కోసం తన ప్రాణాలు అర్పించిన అమరవీరుడు శ్రీకాంతాచారి వర్థంతి కార్యక్రమంలో తనను భాగస్వామ్యం చేయడంసంతోషంగా ఉందని రేవంత్ రెడ్డి చెప్పారు.

"చాలా ఏళ్ల తరువాత ఓయూలో తిరిగి తెలంగాణ చైతన్యం కనిపిస్తోంది. తెలంగాణ.. ఉద్యమ స్ఫూర్తిని, పోరాట పటిమను కోల్పోలేదు. తెలంగాణ అంటే గుర్తొచ్చేది ఓయూ. ఎవరు ఉద్యమకారులో, ఎవరు ఆ ముసుగులో దోచుకుంటున్నారో అందరికీ తెలుసు. సోనియా తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చారంటే అది ఈ బిడ్డల త్యాగాల ఫలితమే. ఉద్యమ ఆకాంక్షలు నెరవేరుస్తామని చెప్పి టీఆర్‌ఎస్ గద్దెనెక్కింది. మలిదశ ఉద్యమంలో అమరులైన 1200 మంది కుటుంబాలకు ఆర్థిక సాయం, ఉద్యోగం, 3ఎకరాల భూమి ఇస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. కానీ 550 కంటే ఎక్కువ మంది అమరులను ప్రభుత్వం గుర్తించలేదు. కొందరి అడ్రస్ తెలియదని ప్రభుత్వం చెబుతోంది. ఇంతకంటే అవమానకరం మరొకటి ఉంటుందా? తెలంగాణ కోసం కొట్లాడి ప్రాణాలు ఇచ్చిన శ్రీకాంత్ చారి ప్రభుత్వానికి గుర్తు రాలేదా? ఆనాటి శ్రీకాంత్ చారి నుంచి ఈనాటి సునీల్ నాయక్ వరకు జరిగిన త్యాగాలు ఎన్నో. గతంలో ఓయూకు రాకుండా నన్ను అడ్డుక్కోవాలని చూసినా వచ్చి విద్యార్థులకు అండగా ఉన్నా." - రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

సామాజిక న్యాయం అంటే తమ సామాజిక వర్గానికి చెందిన నలుగురికి మంత్రి, ఎమ్మెల్యే పదవులు ఇవ్వడం అనుకుంటున్నారు కేసీఆర్ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. తెలంగాణ సాధించుకుంది కేసీఆర్ కుటుంబం, బంధువులు బాగుపడటానికా అని నిలదీశారు. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో అధికారులు మనస్ఫూర్తిగా పని చేయలేకపోతున్నారని వాపోయారు. అన్ని వర్గాల ప్రజలకు తెలంగాణలో అన్యాయమే జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరి ఆధిపత్యం ఉండొద్దని నిజాం నవాబులను తరిమికొట్టిన చరిత్ర తెలంగాణది అని రేవంత్ రెడ్డి అన్నారు.

"నలుగురికి మంత్రి పదవులు ఇస్తే సామాజిక న్యాయమా..? అవినీతి గురించి అధికారులు మాట్లాడితే బదిలీలు చేస్తున్నారు. తెలంగాణలో చర్చ జరిగితే కానిస్టేబుల్‌ శ్రీకాంత్‌ గురించి జరగాలి. అమరవీరులకు స్తూపం కాంట్రాక్టు ఆంధ్రా వాళ్లకు ఇచ్చారు. ప్రస్తుత తెలంగాణ సమాజంలో అన్ని వర్గాలు నష్టపోతున్నాయి. అందుకే కాంగ్రెస్ పార్టీ తరఫున ఏం చేయాలో మీరు మాకు చెప్పండి. మీ సమస్యలు, సూచనలు మాకు ఇవ్వండి. మేధావులతో చర్చించి రాష్ట్రానికి ఏం చేస్తే మేలు జరుగుతుందో మేం ఆ దిశగా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇదే మనం తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన శ్రీకారంతాచారి వంటి అమరవీరులకు ఇచ్చే అసలైన ఘననివాళి." అని రేవంత్ రెడ్డి అన్నారు.

Last Updated : Dec 3, 2022, 3:06 PM IST

ABOUT THE AUTHOR

...view details