తెలంగాణ

telangana

By

Published : Jul 11, 2022, 7:21 PM IST

Updated : Jul 11, 2022, 8:28 PM IST

ETV Bharat / state

Ponds over flow: నిండుకుండల్లా చెరువులు.. అలుగు పారుతూ జల సవ్వడి..

Ponds over flow: మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా చెరువులన్నీ జలకళను సంతరించుకున్నాయి. పెద్దఎత్తున వరదనీరు రావడంతో చాలావరకు పూర్తిగా నిండాయి. భారీ వర్షాలకు రాష్ట్రంలోని 8107 చెరువులు అలుగు పారుతున్నాయి.

Ponds over flow
అలుగు పారుతున్న చెరువులు

Ponds over flow: రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు చెరువుల్లోకి వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. రాష్ట్రంలో మొత్తం 43,870 చెరువులకు గాను 8107 పూర్తిగా నిండి అలుగు పారుతున్నాయి. మరో 8641 చెరువులు 75 నుంచి వందశాతం వరకు నిండాయి. అంటే దాదాపుగా రాష్ట్రంలో మూడో వంతుకు పైగా చెరువులు పూర్తిగా నిండినట్లు తెలుస్తోంది. మరో 7180 చెరువులు 50 నుంచి 75 శాతం వరకు నిండాయి. అదేవిధంగా 8723 చెరువుల్లో నీరు 25 నుంచి 50 శాతం వరకు చేరింది. మరో 11,219 చెరువుల్లో మాత్రం ఇంకా 25 శాతం లోపే నీరు వచ్చింది.

వర్షాలు భారీగా కురిసిన కొత్తగూడెం, మంచిర్యాల, ఆదిలాబాద్, రామగుండం, నిజామాబాద్, ములుగు ప్రాంతాల్లో దాదాపుగా అన్ని చెరువులు నిండాయి. కామారెడ్డి, ఖమ్మం ప్రాంతాల్లోనూ కొన్ని మినహా దాదాపు అన్ని నిండుకుండలా మారాయి. ఉమ్మడి మహబూబ్​నగర్, నల్గొండ, మెదక్, రంగారెడ్డి జిల్లాలతో పాటు కరీంనగర్ జిల్లాల్లోని చెరువుల్లోకి మాత్రం నీరు అంతగా చేరలేదు.

Last Updated : Jul 11, 2022, 8:28 PM IST

ABOUT THE AUTHOR

...view details