రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 50,569 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 239 కొత్త కేసులు(TS Corona cases) నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసులు 6,64,650కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.
TS Corona cases:రాష్ట్రంలో కొత్తగా 239 కరోనా కేసులు... ఇద్దరు మృతి
రాష్ట్రంలో ఇవాళ కొత్తగా 239 కరోనా కేసులు (TS Corona cases)నమోదు కాగా.. ఇద్దరు మృతి చెందారు. తాజాగా కరోనా నుంచి మరో 336 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,778 కరోనా యాక్టివ్ కేసులున్నట్లు వైద్యారోగ్యాశాఖ వెల్లడించింది.
కొత్తగా 239 కరోనా కేసులు
తాజాగా ఇవాళ మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3,911కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 336 మంది వైరస్ బారినుంచి కోలుకున్నారు. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 6,55,961కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,778 యాక్టివ్ కేసులున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఇదీ చూడండి:Vaccination Campaign: రావాలమ్మా రావాలి.. అందరూ వ్యాక్సిన్ వేసుకోవాలి..