గత ప్రభుత్వాల హయంలో బడ్జెట్‌ను ఎలా ఖర్చు పెట్టాలనేదానికి ప్రణాళికలు కూడా లేవని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ వేదికగా (Cm Kcr Speech In Assembly) అన్నారు. తాము అధికారంలోకి వచ్చాకా అంతా ప్రణాళికబద్ధంగా చేస్తున్నామన్నారు. తాను 'ప్లాన్ యువర్ విలేజ్' (Plan Your Village) అనే స్లోగన్ ఇచ్చినట్లు సీఎం చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు గ్రామపంచాయతీలు మురికికూపాలుగా ఉండేవన్నారు. తాము అధికారంలోకి వచ్చాకా గ్రామపంచాయతీల అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నామని ప్రకటించారు. అందుకు నిదర్శనంగా కేంద్ర ప్రభుత్వం అనేక అవార్డులతో గుర్తించిందని పేర్కొన్నారు.
Cm Kcr Speech In Assembly: 'ఊరికొక పంచాయతీ కార్యదర్శి ఏ రాష్ట్రంలోనూ లేరు' - Telangana Assembly sessions
తాము అధికారంలోకి వచ్చాకా గ్రామపంచాయతీల అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నామని సీఎం కేసీఆర్ (Cm Kcr Speech In Assembly) అన్నారు. అందుకు నిదర్శనంగా కేంద్ర ప్రభుత్వం అనేక అవార్డులతో గుర్తించిందని పేర్కొన్నారు.
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాలు భారీగా పెంచినట్లు పేర్కొన్నారు. మంత్రి హోదా ఉన్న జడ్పీ ఛైర్మన్‌కు గౌరవ వేతనం రూ.6 వేలు ఇచ్చేవారన్న ముఖ్యమంత్రి... స్థానిక సంస్థలకు ఇచ్చే నిధుల్లో కేంద్రం 25శాతం కోత విధించిందని తెలిపారు. గతంలో బోరు బావుల్లో పడి ఎందరో పిల్లలు చనిపోయారని సీఎం గుర్తుచేశారు. ఇప్పుడు పల్లెల్లో నిరుపయోగంలో ఉన్న బోరుబావులను పూడ్చేసినట్లు వివరించారు.
ప్రతి గ్రామానికి రూ.5 లక్షల ఆదాయం సమకూరేలా చేస్తున్నామన్నారు. గతంలో 9 వేల గ్రామాలకు 3 వేల పంచాయతీ కార్యదర్శులు ఉండేవారని సీఎం చెప్పారు. ప్రతి ఊరికి ఒక పంచాయతీ కార్యదర్శిని ఉండేలా నియామకాలు చేపట్టినట్లు వివరించారు. ప్రస్తుతం 9,800 మంది పంచాయతీ కార్యదర్శులు ఉన్నారన్న సీఎం... ప్రతి ఊరికొక పంచాయతీ కార్యదర్శి ఏ రాష్ట్రంలోనూ లేరని వెల్లడించారు.