హైదరాబాద్ చందానగర్‌లోని సిగరెట్ల గోదాములో భారీ చోరీ జరిగింది. విష్ణు ఫ్రాంచెరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన సిగరెట్ల గోదాంలోకి ముసుగులు ధరించి ఐదుగురు ఆగంతుకులు ప్రవేశించారు. తలుపులు బద్దలుగొట్టి లోనికి వచ్చిన దుండగులు ముందుగా సీసీ కెమారాల వైర్లను కత్తిరించారు. 80 కాటన్ల సిగరెట్లను చోరీ చేశారు. వ్యాన్‌లో వచ్చి దొంగతనానికి పాల్పడినట్టు పోలీసులు సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా వెల్లడించారు. క్లూస్ టీం నిపుణులు వేలి ముద్రలను సేకరించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సిగరెట్ల గోదాములో చోరీ... 80 కాటన్లు మాయం - THEFT AT CIGARETTE GODOWN AT CHANDHANAGAR
దొంగతానానికి ఏదైనా సరే అనుకున్నారో ఏమో... ఈ అగంతుకులు సిగరెట్లను ఎత్తుకుపోయారు. సీసీ కెమెరాల వైర్లు కత్తిరించి మరీ 80 కాటన్ల సిగరెట్లను మాయం చేశారు. ఈ విచిత్ర దొంగతనం హైదరాబాద్ చందానగర్‌లో జరిగింది.
THEFT AT CIGARETTE GODOWN AT CHANDHANAGAR