కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని... కొత్తగా రూపొందించిన కార్మిక చట్టాలను ఉపసంహరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ బోస్ డిమాండ్ చేశారు. ఈనెల 26న నిర్వహించ తలపెట్టిన భారత్ బంద్‌కు కార్మిక సంఘాలు సంపూర్ణ మద్దతు తెలిపాయి. రైతు రక్షణ కోసం మూడు రైతు చట్టాలను రద్దు చేయాలని రాష్ట్ర కార్మిక, కర్షక, ఉద్యోగ, ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి.
దేశ రాజధానిలో మొక్కవోని దీక్షతో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా ఈనెల 26న భారత్‌బంద్‌ను రాష్ట్రంలో కూడా విజయవంతం చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా పాల్గొనాలన్నారు.