తెలంగాణ

telangana

ETV Bharat / state

కాకర్ల చెరువు ఆక్రమణపై కమిటీ ఏర్పాటు చేసిన ఎన్జీటీ

ఏపీ శ్రీకాకుళం జిల్లా చినదుగాం గ్రామంలో కాకర్ల చెరువు ఆక్రమణపై జాతీయ హరిత ట్రైబ్యునల్ సదరన్ బెంచ్​లో విచారణ జరిగింది. చెరువు అక్రమణ నిజనిర్ధారణపై ఇతరరాష్ట్రాల అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. దీనిపై రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని కమిటీకి సూచిస్తూ..తదుపరి విచారణను సెప్టెంబర్ 15కి వాయిదా వేసింది.

the-ngt-adjourned-the-kakarla-pond-occupation-hearing-to-september-15
కాకర్ల చెరువు ఆక్రమణపై కమిటీ ఏర్పాటు చేసిన ఎన్జీటీ

By

Published : Jul 2, 2020, 4:20 PM IST

ఆంధ్రప్రదేశ్​ శ్రీకాకుళం జిల్లా చినదుగాం గ్రామంలో కాకర్ల చెరువు ఆక్రమణపై ఎన్జీటీ సదరన్ బెంచ్​లో విచారణ జరిగింది. కాకర్ల చెరువు ఆక్రమణకు గురైందని గరీబ్ గైడ్ ఎన్జీవో సంస్థ తరుపున న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఆ భూములు ఎవరికీ క్రమబద్దీకరించలేదని పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు. ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లను వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చుతూ... పిటిషన్ వేశారు. చెరువును పునరుద్ధరిస్తే వ్యవసాయంతోపాటు పశువులకు ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. చెరువు స్థలంలో గ్రామపంచాయతీ, ప్రభుత్వ పాఠశాల భవనాలు సైతం నిర్మించారని పిటిషనర్ వ్యాజ్యంలో పేర్కొన్నారు.

చాలా కాలం నుంచి ఆ చెరువు ప్రాంతంలో పేదవాళ్లు నివసిస్తున్నారని, మానవతా దృక్పథంతో పిటిషన్ కొట్టివేయాలని ప్రభుత్వం తరుపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరువురు వాదనలు విన్న ఎన్జీటీ ...కాకర్ల చెరువు ఆక్రమణలపై కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో తమిళనాడుకు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి, తెలంగాణకు చెందిన చెరువుల సంరక్షణ కమిటీ సభ్యుడు, జిల్లా కలెక్టర్లతో కమిటీని ఏర్పాటు చేశారు.

అక్రమణ నిజంగానే అయ్యిందా ..? లేదా అని తెలుసుకొోవాలని... ప్రత్యక్షంగా పరిశీలించి 2 నెలల్లో నివేదిక ఇవ్వాలని కమిటీకి ఎన్జీటీ సూచించింది. చెరువును పునరుద్ధరిస్తే పర్యావరణానికి జరిగే మేలును అంచనా వేసి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 15కి వాయిదా వేసింది.

ఇదీ చదవండి:పాఠశాలల ప్రారంభంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: విద్యాశాఖ

ABOUT THE AUTHOR

...view details