IAS Officers: వెయిటింగ్లో ఉన్న ఐఏఎస్ అధికారులకు పోస్టింగులు ఇవ్వడంతో పాటు.. మరికొందరిని రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. వాణీ ప్రసాద్‌ను ఈపీటీఆర్ఐ డైరెక్టర్ జనరల్‌గా నియమించింది. ప్రభుత్వ రంగ సంస్థల శాఖ కార్యదర్శిగా నిర్మల, విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శిగా మానిక్కరాజ్కు పోస్టింగ్ ఇచ్చారు.
IAS Officers: రాష్ట్రంలో ఎనిమిది మంది ఐఏఎస్ అధికారుల బదిలీ
IAS Officers: రాష్ట్రంలో మరికొందరు ఐఏఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. అలాగే వెయిటింగ్లో ఉన్నవారికి పోస్టింగులు ఇచ్చింది.
IAS Transfers: పౌసుమి బసు, శ్రుతి ఓజాలను జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్లుగా నియమించారు. విద్యాశాఖ ఉపకార్యదర్శిగా హరితకు పోస్టింగ్ ఇచ్చారు. పశు సంవర్ధక శాఖ కార్యదర్శిగా ఉన్న అనితా రాజేంద్రను మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రానికి బదిలీ చేశారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీఐ డైరెక్టర్ జనరల్‌గా అదనపు బాధ్యతల నుంచి హర్ ప్రీత్ సింగ్‌ను రిలీవ్ చేసి.. అనితా రాజేంద్రకు ఆ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే హోదా విషయంలో మార్పు చేస్తున్నట్లు సమాచారం. ఈపీటీఆర్ఐ డైరెక్టర్ జనరల్‌గా ఉన్న అదర్ సిన్హాను పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేశారు.
ఇదీ చూడండి: