తెలంగాణ

telangana

ETV Bharat / state

Electrical employees strike: ఏప్రిల్ 17 నుంచి విద్యుత్ ఉద్యోగుల సమ్మె..! - telangana latest news

విద్యుత్ ఉద్యోగుల సమస్యలను తీర్చకపోతే.. డిమాండ్లను నెరవేర్చకపోతే ఏప్రిల్17వ తారీఖున ఉద్యోగులంతా కలిసి సమ్మెకు దిగుతామని జేఏసీ కన్వీనర్ రత్నాకర్ రావు తెలిపారు.

The electricity employees will go for strike on April 17 if their problems are not resolved
మా సమస్యలు పరిష్కారం అవ్వకపోతే.. ఏప్రిల్ 17న సమ్మె

By

Published : Apr 15, 2023, 8:09 PM IST

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల సమస్యల సాధనకై ఈనెల 17వ తేదీ నుంచి సమ్మెకు దిగనున్నట్లు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ కన్వీనర్ రత్నాకర్ రావు స్పష్టం చేశారు. ఇప్పటికే సమ్మె నోటీసులు అందించామని చెప్పారు. విద్యుత్ శాఖ, ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రానిపక్షంలో సమ్మె తప్పకుండా చేస్తామని హెచ్చరించారు. సికింద్రాబాద్ వైస్రాయ్ గార్డెన్లో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ సమావేశంలో కీలక నిర్ణయాలను తీసుకున్నారు.

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగులకు గత సంవత్సర కాలంగా సరైన వేతన సవరణ లేక ఫిట్మెంట్ రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రభుత్వం నుంచి కేవలం ఏడు శాతం మాత్రమే ఫిట్మెంట్ అందిస్తామని అన్నారని కనీసం 20 శాతం ఫిట్మెంట్ అయినా ఇవ్వాలని డిమాండ్ చేశారు. పలుమార్లు యాజమాన్యంతో మంత్రులతో ఇదే డిమాండ్లపై చర్చలు సాగినప్పటికీ ఉద్యోగులు అనుకున్న మాదిరిగా పురోగతి లభించలేదని అన్నారు.. వెంటనే తమ డిమాండ్లను పరిష్కరించాలని లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా 45,000 మంది విద్యుత్ ఉద్యోగులు సమ్మెలో పాల్గొని తమ హక్కులకై పోరాటం చేస్తారని వెల్లడించారు.

గత నెల ఖైరతాబాద్​లో:గత నెలలో సమస్యల పరిష్కారం కోసం డిమాండ్ చేస్తూ విద్యుత్ ఉద్యోగులు ఖైరతాబాద్​లోని విద్యుత్ సౌధాలో మహాధర్నా నిర్వహించారు. వేతన సవరణ, ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వీరు చేపట్టిన ధర్నాలో డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో పాల్గొనడానికి వివిధ జిల్లాల నుంచి భారీగా ఉద్యోగులు తరలివచ్చారు. వీరు చేపట్టిన ధర్నా కారణంగా విద్యుత్ సౌధ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యి వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఖైరతాబాద్‌-పంజాగుట్ట రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

"జేఏసీ తరపున రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ ఉద్యోగులు, ఇంజినీర్లు, కార్మికులు అందరూ కూడా 17ఏప్రిల్ ఉదయం 8గంటల నుంచి సమ్మెకు నోటీసు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా విద్యుత్ ఉద్యోగులకు సంవత్సరం కింద నుంచే రావాల్సని వేతన సవరణ ఇంతవరకు కూడా మేనేజ్​మెంట్ ఫైనలైజ్ చేయలేదు. అలాగే ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించిన సమస్యలను కూడా పరిష్కరించాలని జేఏసీ నోటీసు ఇవ్వడం జరిగింది. మేము 30 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని అడిగితే కనీసం 20 శాతం అయినా ఫిట్మెంట్ ఇవ్వాలని ఈరోజు జరిగిన చర్చల్లో కూడా ప్రస్తావించడం జరిగింది. ఇప్పుడు జరుగుతున్న చర్చల్లో పురోగతి రాకపోతే 17వ తారీఖున ఉద్యోగులంతా సమ్మెకు దిగడం జరుగుతుంది."_రత్నాకర్ రావు, తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల సంఘం జేఏసీ కన్వీనర్

ఇవీ చదవండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details