శని, ఆదివారాల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ అధికారి రాజారావు తెలిపారు.
వచ్చే రెండురోజులు మోస్తరు నుంచి భారీ వర్షసూచన - తెలంగాణలో వర్షసూచన
రాష్ట్రంలో రాగల రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే పలు చోట్లు తేలికపాటి నుంచి భారీ వానలు కురిశాయి. ఆది, సోమవారాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షం కురిసే అవకాశముందని పేర్కొంది.
వచ్చే రెండురోజులు మోస్తరు నుంచి భారీ వర్షసూచన
సోమవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు. ఉత్తర బంగాళాఖాతం ప్రాంతాల్లో సుమారుగా ఆగస్టు 4న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.