నైరుతి, తూర్పు తెలంగాణ జిల్లాల్లో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఒకటి, రెండుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడుతుందని తెలిపింది.
ఈరోజు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ.. తెలంగాణలోకి కింది స్థాయి గాలులు నైరుతి దిశ నుంచి వీస్తున్నాయని తెలిపింది. నిన్నటి వరకు తెలంగాణ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆవర్తనం, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక నుంచి సౌరాష్ట్ర వరకు ఉన్న ద్రోణి ఈరోజు బలహీనపడ్డాయని పేర్కొంది.
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. నేడూ పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. నిన్న పలుచోట్ల మోస్తరు వానలుపడ్డాయి. వర్షాకాల సీజన్ ప్రారంభంలోనే భారీ వర్షాలు కురుస్తుండటంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సోమవారం ఉదయం వరకు నమోదైన వర్షపాతం వివరాలు..
అత్యధికంగా సిద్దిపేట జిల్లా హబ్షీపూర్- 16.3 సెం.మీ.
మల్కాజ్‌గిరి మెట్టుగూడ- 13.7 సెం.మీ.
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మం. పూడూరు- 12.8 సెం.మీ.