తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana Top News: టాప్​న్యూస్ @3PM - Telugu top ten news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana Top News today
Telangana Top News today

By

Published : Nov 21, 2022, 2:57 PM IST

  • 'ఎమ్మెల్యేలకు ఎర' కేసు.. సుప్రీం కీలక ఆదేశాలు

'ఎమ్మెల్యేలకు ఎర' కేసులో సిట్టింగ్‌ జడ్జి పర్యవేక్షణను సుప్రీంకోర్టు ఎత్తివేసింది. సింగిల్‌ జడ్జి పర్యవేక్షణ, సిట్‌ విచారణ నిలిపేయాలంటూ ఈ కేసు నిందితులు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. సిట్టింగ్‌ జడ్జి పర్యవేక్షణలో విచారణ జరపాలంటూ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను ధర్మాసనం పక్కన పెట్టింది.

  • చిరంజీవిపై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం..

మెగాస్టార్‌ చిరంజీవిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. 'ఇండియన్‌ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌ - 2022' పురస్కారం చిరంజీవిని వరించడంపై మోదీ స్పందిస్తూ తాజాగా ఓ ట్వీట్‌ చేశారు.

  • 'రాష్ట్రంలో విస్తరిస్తోన్న ఆర్ఎస్ఎస్ భావజాలం..

రాష్ట్రంలో బీజేపీ, ఆర్​ఎస్​ఎస్​ భావజాలం విస్తరించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆందోళన వ్యక్తం చేశారు. మునుగోడు ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై సీపీఎం నేతలు ఖమ్మంలో చర్చించారు.

  • 'పంతాలు, పట్టింపుల కోసం ఆ రెండు పార్టీలు రాష్ట్రాన్ని నష్టపరుస్తున్నాయి'

బీజేపీ, టీఆర్ఎస్ పంతాలు.. వ్యక్తిగత ప్రతిష్ఠ కోసం చేస్తున్న పోరులో రాష్ట్రం నష్టపోతోందని రెేవంత్​రెడ్డి ఆరోపించారు. ధరణి పోర్టల్ రైతుల పాలిట గుదిబండలా మారిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పినా ఇప్పటికీ పూర్తికాలేదని రేవంత్ మండిపడ్డారు.

  • ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పోరు..

తెలంగాణ కాంగ్రెస్ నేతలు సీఎస్‌ సోమేశ్ కుమార్‌ను కలిశారు. ఆయనతో భేటీ అయి ఆరు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ధాన్యం కొనుగోలుతో పాటు పోడు భూములు, రుణ మాఫీ, పంట నష్టం.. వంటి ఆరు అంశాలపై సీఎస్‌కు వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు.

  • అద్దెకు ఆర్టీసీ బస్సులు..

ఆదాయ మార్గాలు పెంచుకోవడంపై రాష్ట్ర ఆర్టీసీ దృష్టిసారించింది. ప్రస్తుతం ఉన్న మార్గాల్లో బస్సులను నడపడంతో పాటు డిమాండ్ ఉన్న మార్గాలపై కసరత్తులు చేస్తోంది. ఇప్పటివరకు సాఫ్ట్‌వేర్ కంపెనీలకు బస్సులను నడిపిన ఆర్టీసీ, కొత్తగా ఆ కంపెనీలకే బస్సులను అద్దెకు ఇవ్వాలని నిర్ణయించింది.

  • భారీ భూకంపం.. 20 మంది మృతి..

ఇండోనేసియాలో భారీ భూకంపం సంభవించింది. సుమారు 20 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. సుమారు 300 మందికి గాయాలయ్యాయి. వందల సంఖ్యలో భవనాలు దెబ్బతిన్నాయి. పశ్చిమ జావా ప్రావిన్స్‌లోని సియాంజూర్ ప్రాంతంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది.

  • వరల్డ్ రికార్డు సృష్టించిన తమిళనాడు క్రికెటర్​ జగదీశన్..

విజయ్​ హాజారే ట్రోఫీలో భాగంగా అరుణాచల్​ ప్రదేశ్​, తమిళనాడు మధ్య జరుగుతున్న మ్యాచ్​లో తమిళనాడు ఓపెనర్​ నారాయణ్​ జగదీశన్​ వీరవిహారం చేశాడు. లిస్టు ఏ క్రికెట్​లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్​గా జగదీశన్​(277) రికార్డు సృష్టించాడు.

  • సూపర్​స్టార్​ కృష్ణ అస్థికలను కృష్ణా నదిలో కలిపిన మహేష్​బాబు

ఇటీవల మృతి చెందిన తన తండ్రి సూపర్​స్టార్​ కృష్ణ అస్థికలను మహేశ్​ బాబు ఏపీలోని ఉండవల్లి వద్ద ఉన్న కృష్ణా నదిలో కలిపారు. ఆయన వెంట దర్శకుడు త్రివిక్రమ్, హీరో సుధీర్​బాబు తదితరులు ఉన్నారు.

  • అబుదాబిలో రణ్​వీర్ సింగ్ సందడే సందడి

ఎడాది దేశం అబుదాబిలో బాలీవుడ్ నటుడు రణ్​వీర్ సింగ్ హ్యాపీగా జాలీగా గడుపుతున్నారు. తాజాగా దుబాయ్​లో జరిగిన ఫిల్మ్ ఫేర్ ఈవెంట్​లో పాల్గొని సందడి చేశారు. ఆటాపాటలతో ఈ వేడుకకు ఉత్సాహాన్ని అందించారు. అటు నుంచి అబుదాబిలో జరుగుతున్న అబుదాబి గ్రాండ్ ప్రిక్స్ ఈవెంట్​కు హాజరయ్యారు. అక్కడ రణ్​వీర్ చేసిన అల్లరి మామూలుగా లేదు.

ABOUT THE AUTHOR

...view details