తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana Top News: టాప్​న్యూస్ @3 PM - Telugu top ten news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana Top News
Telangana Top News

By

Published : Oct 31, 2022, 3:00 PM IST

  • 'రాహుల్‌తో కలిసి ఒక్క కిలోమీటరైనా నడవాలి'

Revanth Reddy on Bharat Jodo Yatra : తెలంగాణ ప్రజలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో చేపట్టిన భారత్ జోడో యాత్రకు రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరు మద్దతునివ్వాలని కోరారు. రాహుల్‌తో కలిసి ప్రతి ఒక్కరు కనీసం ఒక్క కిలోమీటరైనా నడవాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం చార్మినార్‌ వద్ద యాత్రలో పాల్గొనాలని లేఖలో పేర్కొన్నారు.

  • 'భాజపా దొడ్డి దారుల్లో ప్రభుత్వాలను పడగొడుతోంది'

Harish rao comments on BJP: తెరాస ఎమ్మెల్యే ఎర కేసు తరవాత తెలంగాణ రాజకీయం రసవత్తరంగా మారిపోయింది. తెరాస, భాజపా నేతలు ఇరువురు ఒకరికి ఒకరు ప్రత్యక్షంగా విమర్శలు చేసుకుంటున్నారు. నిన్న కేసీఆర్​ చండూర్​ సభలో భాజపాను విమర్శిస్తే.. అదే రోజు భాజపా నేతలు కిషన్​రెడ్డి, బండి సంజయ్​ ప్రతి విమర్శలు చేశారు. తాజాగా నేడు హరీశ్​రావు భాజపాపై విరుచుకుపడ్డారు.

  • కిషన్​రెడ్డి స్వగ్రామాన్ని దత్తత తీసుకున్న సినీ నిర్మాత

Abhishek Agarwal adopted to Timmapur: ప్రముఖ సినీ నిర్మాత అభిషేక్ అగర్వాల్ తన తండ్రి తేజ్ నారాయణ్ అగర్వాల్ 60వ పుట్టినరోజు సందర్భంగా కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్​రెడ్డి స్వగ్రామంమైన రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. అభిషేక్ అగర్వాల్ కుటుంబం స్థాపించిన చంద్రకళ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

  • డ్యాన్స్​లతో హోరెత్తించిన కేఏ పాల్

KA Paul Dance with Kids in Chandur : మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో ప్రచార గడువు దగ్గర పడడంతో అన్ని పార్టీల నేతలు ప్రచారాన్ని వేగవంతం చేశారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా ఇవాళ చండూరు మండలంలో ప్రచారాన్ని నిర్వహించారు. చిన్నపిల్లలతో కలసి డ్యాన్స్​లు వేశారు.

  • జూబ్లీహిల్స్ పరిధిలో రూ.90 లక్షలు పట్టివేత

Hawala Cash Seized at Jubilee Hills : మునుగోడు ఉపఎన్నిక వేళ రాష్ట్రంలో భారీగా నగదు పట్టుబడుతోంది. తాజాగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిధిలో కారులో తరలిస్తున్న రూ.90 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగదుతో పాటు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

  • సుప్రీం సీరియస్..

అత్యాచార బాధితులకు నిర్వహించే 'టూ ఫింగర్ టెస్ట్'లు ఇప్పటికీ కొనసాగుతుండటం దురదృష్టకరమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ పరీక్షలను అడ్డుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. మరోవైపు, ఆధార్- ఓటర్ ఐడీ అనుసంధానాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్​ను విచారణకు స్వీకరించిన సుప్రీం.. ఖైదీలకు ఓటేసే అవకాశం లేకపోవడంపై నమోదైన పిల్​కు కేంద్రం, 'ఈసీ'ల నుంచి స్పందన కోరింది.

  • శరద్​ పవార్​కు అనారోగ్యం​..

ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్.. ముంబయిలో బ్రీచ్​ క్యాండీ ఆస్పత్రిలో చేరారు. మూడు రోజుల పాటు ఆయన చికిత్స పొందనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.

  • ల్యాప్స్‌ అయిన పాలసీలతో మోసాలు..

ల్యాప్స్‌(రద్దు) అయిన పాలసీలు కలిగిన పాలసీదారులను లక్ష్యంగా చేసుకుని అనేక రకాల మోసాలకు పాల్పడుతున్నారు. ఇవి ఎలా ఉంటాయో చూద్దాం.

  • విరాట్​ కోహ్లీ, అనుష్క ఫుల్​ సీరియస్​

టీమ్ఇండియా స్టార్ బ్యాటర్​ విరాట్​ కోహ్లీకి చేదు అనుభవం ఎదురైంది. దీనిపై కోహ్లీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ మేరకు సోషల్​ మీడియా వేదికగా స్పందించాడు. ఇంతకీ ఏమైందంటే..

  • హిట్​ డైరెక్టర్​తో కమల్​ కొత్త మూవీ?..

'విక్రమ్' సినిమాతో ఘన విజయం అందుకున్నారు విలక్షణ నటుడు కమల్ హాసన్​. ఆ జోష్​తో ఇప్పుడు ఆయన వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. తాజాగా మరో హిట్​ దర్శకుడికి కమల్​ గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చారట​.

ABOUT THE AUTHOR

...view details