ఉక్రెయిన్‌లో యుద్ధ పరిస్థితుల నుంచి తెలుగు వారిని సురక్షితంగా భారత్‌కు తీసుకువచ్చేందుకు చర్యలు వేగవంతమవుతున్నాయి. భారత రాయబార కార్యాలయం, అక్కడ విద్యాసంస్థల్లో విద్యార్థుల అడ్మిషన్లో సహాయపడిన సంస్థల సహకారంతో భారతీయ విద్యార్థులు స్వదేశీ బాట పడుతున్నారు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్‌లోని ఉజొహోర్డ్ జాతీయ విశ్వవిద్యాలయం నుంచి 300 మంది విద్యార్థులను హంగేరీ తరలించే ప్రక్రియ ఇవాళ పూర్తయింది.
కన్సల్టెన్సీ సంస్థల సహకారంతో.. సురక్షితంగా తెలుగు విద్యార్థుల తరలింపు
ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల యుద్ధంతో.. రెండు రోజులుగా కంటిమీద కునుకులేకుండా బతుకుతున్న భారతీయ విద్యార్థులకు క్రమంగా ఉపశమనం లభిస్తోంది. ఇండియన్ ఎంబసీ, కన్సల్టెన్సీ సంస్థల సహకారంతో వారిని స్వదేశానికి తరలించేందుకు చర్యలు ఊపందుకుంటున్నాయి. ప్రత్యేక బస్సుల ద్వారా వారిని సరిహద్దులకు తరలిస్తున్నారు.
ఉక్రెయిన్‌లో తెలుగు విద్యార్థులు
శుక్రవారం 350 మంది విద్యార్థులను ప్రత్యేక బస్సుల్లో హంగేరీకి చేర్చాయి. అక్కడ హంగేరీ బార్డర్ నుంచి భారత్‌కు రప్పించేలా కృషి చేస్తున్నాయి. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌లో మెడిసిన్ చదువుతున్న తమ పిల్లలను భారత్‌కు తిరిగి పంపేలా చొరవ తీసుకుంటున్న ఆల్ఫా ఎడ్యుకేర్ కన్సల్టెన్సీ డైరెక్టర్ అఖిల్‌కు విద్యార్థులు, తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇదీ చదవండి:Indians in Ukraine: 219 మంది భారతీయులతో బయల్దేరిన విమానం