తెలంగాణ

telangana

By

Published : Jul 4, 2022, 5:33 PM IST

ETV Bharat / state

Schools Bandh: రేపు రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల బంద్‌..!

schools bandh in TS: ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 5న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల బంద్‌కు ఏబీవీపీ పిలుపునిచ్చింది. అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు బంద్‌లో పాల్గొని విజయవంతం చేయాలని కోరింది.

Schools Bandh:
Schools Bandh:

schools bandh in TS: పాఠశాలల్లో ప్రధాన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ... రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు మంగళవారం 5వ తేదీన బంద్ పాటించాలని ఏబీవీపీ పిలుపునిచ్చింది. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, మౌలిక వసతులు కల్పించాలనే ప్రధాన డిమాండ్లతో పాఠశాల బంద్‌కు పిలుపునిచ్చినట్లు ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కమల్‌ సురేష్‌ వెల్లడించారు.

ఈనెల 2న పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయం ముందు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసిన 34మంది విద్యార్థులపై అక్రమంగా బనాయించిన కేసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రిమాండ్‌లో ఉన్న విద్యార్థులను విడుదల చేయాలని కోరారు. పాఠశాలలు ప్రారంభమై 20రోజులు గడుస్తున్నా... పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు పంపిణీ చేయలేదని ఆక్షేపించారు. ఫీజు నియంత్రణ చట్టం అమల్లోకి తీసుకువచ్చి కార్పొరేట్ పాఠశాలలను సీజ్‌ చేయాలని విజ్ఞప్తి చేశారు.

కేసీఆర్‌ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మన ఊరు-మనబడి కార్యక్రమం విఫలమైందని సురేష్‌ ఆరోపించారు. సీఎం కేసీఆర్ సొంత జిల్లాలోనే విద్యార్థులకు మరుగుదొడ్ల సౌకర్యంలేక ఇటీవల బహిర్బూమికి బయటకు వెళ్లి నీటి గుంతలో పడిచనిపోయారని తెలిపారు. పాఠశాలలకు వెంటనే మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.

ఇవీ చూడండి :

ABOUT THE AUTHOR

...view details