తెలంగాణ

telangana

By

Published : Nov 5, 2020, 7:34 PM IST

ETV Bharat / state

'అదృశ్యం కేసులపై ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారు?'

రాష్ట్రంలో అదృశ్యం కేసులను ఛేదించేందుకు ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారు? భవిష్యత్తు ప్రణాళిక ఏమిటో వివరిస్తూ నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు తెలిపింది. విషయంపై తదుపరి విచారణను డిసెంబర్​ 10కి వాయిదా వేసింది.

telangana high court hearing on missing cases in telangana state
'అదృశ్యం కేసులపై ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారు?'

తెలంగాణలో మిస్సింగ్​ కేసులు పెరిగిపోతున్నాయని గతంలో న్యాయవాది భాస్కర్​ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఆర్ఎస్​చౌహాన్, జస్టిస్​ విజయ్​సేన్​ రెడ్డి ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది. రాష్ట్రంలో 2014 నుంచి 2019 వరకు ఎనిమిది వేల అదృశ్యం కేసులు నమోదయ్యాయని.. ఇటీవల రెట్టింపు అయ్యాయని పిటిషనర్​ తరపు న్యాయవాది తెలిపారు. ఎక్కువగా బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందినవారే అదృశ్యమవుతున్నారని పేర్కొన్నారు.

అదృశ్యం కేసులను ఛేదించేందుకు షీబృందాలు, దర్పన్​ యాప్, మహిళా భద్రత విభాగం, ఆపరేషన్​ ముస్కాన్​ తదితర విభాగాలు, కార్యక్రమాల ద్వారా చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారు? భవిష్యత్తు ప్రణాళిక వివరిస్తూ డిసెంబర్​ 3లోగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 10కి వాయిదా వేసింది.

ఇదీ చదవండిఃధరణిపై హైకోర్టు కీలక ఆదేశాలు... నమోదుపై మధ్యంతర ఉత్తర్వులు

ABOUT THE AUTHOR

...view details