తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎక్స్ అఫీషియో సభ్యుల ఓటుపై సర్కారుకు హైకోర్టు నోటీసులు - తెలంగాణ హైకోర్టు వార్తలు

గ్రేటర్ ఎన్నికల్లో ఎక్స్‌అఫీషియో సభ్యుల ఓటు హక్కుపై హైకోర్టు విచారణ చేపట్టింది. వివరణ ఇవ్వాలని ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం, జీహెచ్​ఎంసీకి నోటీసులు జారీ చేసింది.

telangana-high-court-hearing-on-ex-officio-votes
రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు నోటీసులు

By

Published : Dec 3, 2020, 1:01 PM IST

బల్దియాలో ఎక్స్‌అఫీషియో సభ్యుల ఓటుహక్కుపై వేసిన పిటిషన్​పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఓటు హక్కును సవాల్ చేస్తూ బాల్కొండ మాజీ ఎమ్మెల్యే అనిల్​కుమార్ పిటిషన్​ దాఖలు చేశారు. జీహెచ్​ఎంసీ చట్టంలోని సెక్షన్ 90(1)ని కొట్టేయాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు.

విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం, జీహెచ్ఎంసీకి నోటీసులు జారీ చేసింది. సరైన వివరణ ఇవ్వాలని కోరింది. తదుపరి విచారణను జనవరి 4వ తేదీకి వాయిదా వేసింది.

ఇదీ చూడండి:'మహిళా కమిషన్ ఛైర్​పర్సన్​ను ఈనెల 31లోపు నియమించాలి'

ABOUT THE AUTHOR

...view details