గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దిల్లీ పర్యటనలో భాగంగా... ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ప్రధానితో భేటీ అయిన సౌందరరాజన్... రాజ్‌భవన్‌లో చేపట్టిన వినూత్న అంశాలపై ప్రధానికి వివరించారు. ప్లాస్టిక్ నిషేధం, యోగా తరగతులు, రక్తదాన శిబిరం వంటి కార్యక్రమాలపై నివేదిక అందించగా... గవర్నర్‌ను ప్రధాని మోదీ అభినందించారు. అనంతరం తమిళిసై కేంద్రం హోంమంత్రి అమిత్‌షాను కలిశారు. గవర్నర్‌గా పాల్గొన్న సామాజిక కార్యక్రమాలు, బతుకమ్మ సంబురాలపై ప్రతులను అందించారు.
ప్రధాని మోదీతో గవర్నర్ తమిళిసై భేటీ...
ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాతో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ భేటీ అయ్యారు. దిల్లీ పర్యటనలో భాగంగా సమావేశమైన తమిళిసై... రాష్ట్రంలోని తాజా పరిస్థితులను ప్రధానికి వివరించారు. పలు అంశాలపై నివేదిక అందించగా... గవర్నర్‌ను ప్రధాని అభినందించారు.
TELANGANA GOVERNOR TAMILISAI MEET PRESIDENT MODI IN DELHI AT FIRST TIME
Last Updated : Oct 16, 2019, 3:04 PM IST