తెలంగాణ

telangana

ETV Bharat / state

కళాకారులను ఆదుకునేందకు దాతలు ముందుకురావాలి: రమణాచారి

కరోనా మహమ్మారి కారణంగా ఉపాధి కోల్పోయిన కళాకారులకు ప్రత్యామ్నయ ప్రదర్శనలిచ్చే ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రభుత్వ సలహాదారు రమణాచారి కోరారు. ప్లాంజేరి ఫౌండేషన్, తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం సంయుక్తంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కళాకారులకు ఆర్థిక సాయంతో పాటు.. నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు.

Ramanachari called for supporting artists
కళాకారులను ఆదుకోవాలని పిలుపునిచ్చిన కేవీ రమణాచారి

By

Published : Jun 13, 2021, 7:49 PM IST

లాక్​డౌన్​ సమయంలో ప్రదర్శనలు లేక ఉపాధి కోల్పోయిన కళాకారులను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి కోరారు. ప్లాంజేరి ఫౌండేషన్, తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం సంయుక్తంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కళాకారులకు ఆర్థిక సహాయం, వాయిద్య పరికరాలు, నిత్యావసర వస్తువులను ఆయన అందజేశారు.

ఉపాధి కోల్పోయిన కళాకారులకు ఆర్థిక సాయం చేయడం కాకుండా... వారికి ప్రత్యామ్నయంగా ప్రదర్శనలిచ్చే ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రమణాచారి కోరారు. తోటి మానవులకు దానం చేసే దానికంటే పవిత్రమైన హోమం మరొకటి లేదన్నారు. లాక్​డౌన్​ కారణంగా ఉపాధి కోల్పోయిన కళాకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సభ్యత్వం ఉన్న 30 వేల మంది కళాకారులకు విడతల వారిగా నిత్యావసర సరుకులు అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన కళాప్రదర్శన చూపరులను అలరించింది.

ఇదీ చదవండి:తీవ్ర ఇన్​ఫెక్షన్​కూ భారతీయ టీకాలు చెక్!

ABOUT THE AUTHOR

...view details