తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana Fire Department : 'ఎలాంటి రెస్క్యూకైనా మేం రెఢీ'.. తెలంగాణ అగ్నిమాపక శాఖ డీజీ

Telangana Fire Department 2023 : రాష్ట్రం పెరుగుతన్న ప్రమాదాల దృష్ట్యా అగ్నిమాపక శాఖ వారి సిబ్బందికి పలు అంశాల్లో శిక్షణ ఇచ్చారు. అగ్నిప్రమాదాలు, వరదలు సంభవించినప్పుడు ఎలాంటి చర్యలు తీలుకోవాలన్నా దానిపై హుస్సేన్ సాగర్ తీరంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.

fire
fire

By

Published : Jul 15, 2023, 1:29 PM IST

ఎన్డీఆర్​ఎఫ్​ తరహా రాష్ట్రంలో ఎస్డీఆర్​ఎఫ్​

Telangana Fire Department News : ఎన్డీఆర్​ఎఫ్​ తరహాలో సేవలు అందించడానికి అగ్నిమాపక శాఖ సిద్ధమవుతుంది. ఎస్డీఆర్​ఎఫ్ విభాగం ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు అగ్నిమాపక డీజీ నాగిరెడ్డి తెలిపారు. ప్రమాదవశాత్తు ఎవరైనా నీటిలో పడిపోతే ఏవిధంగా వారిని రక్షించాలో.. హైదరాబాద్‌ హుస్సేన్ సాగర్ తీరంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోంశాఖ సెక్రటరీ డాక్టర్ జితేందర్, సీనియర్ ఐఏఎస్ అధికారి రాహుల్ బొజ్జ, అగ్నిమాపక డిజీ నాగిరెడ్డి తదితరులు హాజరయ్యారు.

Telangana Disaster Response Force :ఎలాంటి ఆపదలోనైనా రెస్క్యూ చేయడంలో తాము ముందంజలో ఉన్నామని అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి అన్నారు. ప్రకృతి విపత్తులను ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. నీటిలో పడిపోయిన వాళ్లను సిబ్బంది ఎలా కాపాడాలనే అంశంపై అధికారులు... హుస్సేన్‌సాగర్‌ తీరంలోఅవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. వర్షాకాలం ఎక్కడైనా వరదలు సంభవిస్తే వాటికోసం 20 పడవలను సిద్ధంగా ఉంచామని తెలిపారు.

వరదల సమయంలో ఆపదలో ఉన్న వారిని ఎలా రక్షించాలనే అంశాలపై.. పుణేకు చెందిన ఇండియన్ రెస్క్యూ అకాడమీతో శిక్షణ ఇప్పించారు. ఈ శిక్షణలో 149మంది పాల్గొన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 64 మంది శిక్షణ పూర్తి చేశారు. ప్రమాద సమయాల్లో ప్రజల ప్రాణాలను ఎలా కాపాడాలో.. సాంకేతికతను ఉపయోగించి శిక్షణ పూర్తి చేశామని సిబ్బంది వెల్లడించారు. ఏదైనా ప్రమాదం జరిగితే బాధితుల్ని రక్షించడానికి పోరాడుతామన్నారు. దాదాపు మూడు సంవత్సరాలుగా అధికారులు ఇస్తున్న శిక్షణ తీసుకుంటున్నామని వివరించారు. ఎన్డీఆర్​ఎఫ్​ తరహాలో ఎస్డీఆర్​ఎఫ్ విభాగం ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని డీజీ నాగిరెడ్డి వెల్లడించారు.

"నగరాల్లో వచ్చే వరదలు కానీ, భవనాలు కూలినప్పుడు, రోడ్డు రైలు ప్రమాదాలు సంభవించినప్పుడు, లిప్టుల్లో ఎవరైనా ఇరికినప్పుడు వారి కాపాడం.. సెల్​పోన్​ టవర్​ రేడియో టవర్స్ ఎక్కిన జనాలను కాపాడటం ఇలా అన్ని అంశాల్లో తెలంగాణ ఫైర్​ డిపార్ట్​మెంట్​ ట్రైన్​ అయ్యి ఉన్నారు. ప్రజల్ని ఎలాంటి ఆపదలో నుంచైనా కాపాడేటందుకు చేసే అన్ని ప్రయత్నాలను నేర్పించడం జరిగింది. ఎన్డీఆర్​ఎఫ్​ తరహాలో ఎస్డీఆర్​ఎఫ్​ను ఏర్పరుస్తున్నాం. 50మందితో బృందాన్ని చేస్తాం. అక్రమంగా ఇళ్లు నిర్మించిన వారికి నోటీసులు పంపించడం జరిగింది." -నాగిరెడ్డి, అగ్నిమాపక శాఖ డీజీ

అగ్నిమాపక శాఖ అధికారులు ప్రవేశపెట్టనున్న ఎస్డీఆర్​ఎఫ్ బృందాలు త్వరలోనే ప్రజలకు సేవ చేసేందుకు అందుబాటులోకి రానున్నాయని అధికారులు తెలిపారు. ప్రమాదాలు సంభవించినప్పుడు బాధితులను రక్షించేందుకు.. అధునాతన పరికరాలతో అగ్నిమాపక సిబ్బంది సిద్ధంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details