తెలంగాణ ఉన్నత విద్యామండలి ఈ-సెట్ షెడ్యూల్ ఖరారు చేసింది. ఈనెల 22 నుంచి మే 17 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆలస్య రుసుముతో జూన్ 28 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు ఉన్నత విద్యామండలి తెలిపింది.
తెలంగాణ ఈ-సెట్ షెడ్యూల్ విడుదల - telangana ecet exam
ఈ-సెట్ షెడ్యూలను ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. ఈ నెల 22 నుంచి మే 17 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కన్వీనర్ పేర్కొన్నారు. జులై 1న ఈ-సెట్ పరీక్ష నిర్వహించనున్నారు.
తెలంగాణ ఈ-సెట్ షెడ్యూల్ విడుదల
ఎస్సీ, ఎస్టీలకు 400 రూపాయలు, ఇతరులకు 800 రూపాయలు రుసుము ఖరారు చేశారు. జులై 1న ఈసెట్ పరీక్ష నిర్వహించనున్నట్టు కన్వీనర్ వెంకటరమణారెడ్డి తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు ఆన్‌లైన్‌లో ఈసెట్ జరగనుంది.