Telangana Congress Screening Committee :రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే గెలుపుగుర్రాలపై.. కాంగ్రెస్ దృష్టిసారించింది. నేడు, రేపు దిల్లీలో సమావేశం కానున్న స్క్రీనింగ్ కమిటీ.. అభ్యర్థుల ఎంపిక(Telangana Congress MLAs List)ను పూర్తిచేయనుంది. ప్రదేశ్ ఎన్నికల కమిటీ- పీఈసీ ప్రతిపాదనలపై ఇప్పటికే సర్వే పూర్తైనట్లు తెలుస్తోంది. సర్వేలు, సామాజిక, స్థానిక రాజకీయ స్థితిగతుల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేయనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే 20కి పైగా నియోజకవర్గాల్లో పీఈసీ ఒక్కరి పేరునే సూచించినట్లు తెలుస్తోంది. వారిలోనూ ప్రత్యర్థులతో తలపడే శక్తిసామర్థ్యం ఉందా లేదా కోణంలోనూ సర్వే నిర్వహించినట్లు విశ్వసనీయ సమాచారం. 25 నుంచి 30 చోట్ల ఇద్దరి పేర్లు, దాదాపు 50 నియోజకవర్గాలకు ముగ్గురు, మరో 10 నుంచి 14 నియోజకవర్గాలకు నలుగురి పేర్లను.. స్క్రీనింగ్ కమిటీకి పీఈసీ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది.
Telangana Congress MLA Candidates 2023 : ఈ మొత్తంగా కలిపి దాదాపు 300 మంది పేర్లను ప్రదేశ్ ఎన్నికల కమిటీ.. స్క్రీనింగ్ కమిటీకి సిఫారసు చేసినట్టుగా విశ్వసనీయవర్గాల సమాచారం. స్క్రీనింగ్ కమిటీ ఇవాళ రేపు రెండు రోజులు సమావేశం కొనసాగినప్పటికీ పీఈసీ జాబితా నిశితంగా పరిశీలించి అభ్యర్థుల ఎంపికపై ఒక నిర్ణయానికి రానుంది. వన్ నేషన్.. వన్ ఎలక్షన్ విధానములో జమిలి ఎన్నికలు(Jamili Elections 2024) వస్తున్నట్లు ప్రచారం అవుతుండటంతో.. కేంద్రం వ్యవహరిస్తున్న తీరును దృష్టిలో ఉంచుకొని స్క్రీనింగ్ కమిటీ కేంద్ర ఎన్నికల కమిటీకే నివేదించనుంది.
పీఈసీ జాబితాని నిశితంగా పరిశీలించి కేంద్ర ఎన్నికల కమిటీకి.. కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ నివేదిక ఇవ్వనుంది. ఆ నివేదిక ఆధారంగా మొదటి జాబితా విడుదల చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. టికెట్లకోసం పోటీపడుతున్న ఆశావహుల్లో కొందరు ఢిల్లీ బాటపట్టారు. ప్రధానంగా స్క్రీనింగ్ వద్ద తమ గురించి ప్రస్తావించి టికెట్ వచ్చేటట్టుగా చూడాలని.. ఏఐసీసీ నేతలను ఆశావహులు కోరుతున్నారు.
Rahul Gandhi At Congress Vijayabheri Sabha : '100 రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఇంటికే'