తెలంగాణ

telangana

ETV Bharat / state

వీవీప్యాట్ల ఘటనపై వివరణ ఇవ్వాలని సీఈవో ఆదేశం

vvpats issue in huzurabad bypoll
వీవీప్యాట్ల తారుమారుపై వివరణ ఇవ్వాలని సీఈవో ఆదేశం

By

Published : Oct 31, 2021, 1:49 PM IST

Updated : Oct 31, 2021, 2:51 PM IST

13:47 October 31

రేపటిలోగా నివేదిక ఇవ్వాలని సీఈవో ఆదేశం

హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా వీవీ ప్యాట్లు తారుమారయ్యాయనే వార్తలొచ్చాయి. దీంతో పాటు భాజపా నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) శశాంక్​ గోయల్​కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో దీనిపై వివరణ ఇవ్వాలని కరీంనగర్‌ కలెక్టర్‌, హుజూరాబాద్‌ ఆర్వోకు సీఈవో ఆదేశాలు జారీ చేశారు. రేపటిలోగా నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు.

ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై సీఈవో.. ఎన్నికల అధికారులతో నిర్వహించిన సమీక్ష సందర్భంగా ఈ మేరకు ఆదేశించారు. మరోవైపు అన్ని రాజకీయ పార్టీల నేతలతో శశాంక్​ గోయల్​ రేపు సమావేశం కానున్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ 2022 ప్రక్రియపై సమావేశంలో చర్చించనున్నారు.

కాగా.. ఎన్నికల్లో తెరాస అధికార దుర్వినియోగానికి పాల్పడిందంటూ భాజపా నేతలు.. సీఈవో శశాంక్​ గోయల్​కు ఉదయం ఫిర్యాదు చేశారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్లు తరలించాలనే ఆలోచన చేశారని డీకే అరుణ, రాజా సింగ్​, రామ చందర్​ రావు ఫిర్యాదులో పేర్కొన్నారు. 

ఇదీ చదవండి:DK Aruna: 'ఓటమి భయంతోనే ఈవీఎంలు, వీవీప్యాట్లు మారుద్దామనే ఆలోచన'

Last Updated : Oct 31, 2021, 2:51 PM IST

ABOUT THE AUTHOR

...view details