TET Teachers Promotion in Telangana 2024 :తెలంగాణలో ప్రభుత్వ ఉపాధ్యాయులు పదోన్నతి పొందాలంటే, టెట్ ఉత్తీర్ణులు కావడం తప్పనిసరి. ఈ మేరకు సర్కార్ తుది నిర్ణయానికి వచ్చింది. విద్యాహక్కు చట్టం, జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి నిబంధనల ప్రకారం, ఉపాధ్యాయులుగా నియమితులైన వారు పదోన్నతి పొందాలంటే టెట్‌లో పాస్‌కావాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు సైతం ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి (CM Revanth Reddy) వివరించారు.
TET Is Must For Teacher Promotion Telangana : ఈక్రమంలో టెట్ నిర్వహణపై విద్యాశాఖ దృష్టి సారించింది. అయితే ఆ పరిణామం వేలాది మంది సీనియర్ ఉపాధ్యాయుల్లో అలజడి రేపుతోంది. కొత్త నియామకాల్లో ఆ నిబంధనను అమలు చేస్తున్న పాఠశాల విద్యాశాఖ, పదోన్నతులకు మాత్రం అమలు చేయట్లేదు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష పాసైన వారికే పదోన్నతులివ్వాలని, పలువురు ఉపాధ్యాయులు కొద్ది నెలల క్రితం హైకోర్టును ఆశ్రయించారు.
పదోన్నతి కోసం టెట్ పాసైన వారి సీనియారిటీ జాబితా సమర్పించాలని, గత సెప్టెంబరు 27న హైకోర్టు మధ్యంతర తీర్పు ఇవ్వడంతో ప్రమోషన్లకు బ్రేక్ (Teacher Promotions in Telangana)పడింది. దీంతో స్కూల్ అసిస్టెంట్లుగా, గెజిటెడ్ హెచ్‌ఎంలుగా పలువురికి దక్కాల్సిన ప్రమోషన్లకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే.
మెగా డీఎస్సీ ద్వారా టీచర్ల భర్తీకి చర్యలు తీసుకోండి : సీఎం రేవంత్ రెడ్డి
టెట్ ఉత్తీర్ణులైన టీచర్లు 26 వేల మందే :తెలంగాణలో మొత్తం మంజూరైన ఉపాధ్యాయ పోస్టులు 1,22,386 ఉంటే, ప్రస్తుతం 1,03,343 మంది పనిచేస్తున్నారు. అంటే 19,043 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉపాధ్యాయ అర్హత పరీక్ష ప్రవేశపెట్టిన తర్వాత 2012, 2017లలో మాత్రమే టీచర్ల నియామకాలు జరిగాయి. అంటే టెట్ పాసై (Telangana TET) ఉపాధ్యాయులుగా చేరిన వారు రాష్ట్రంలో 15,000 మందికి మించరు. దానికితోడు మరో 11,000ల మంది 1996, 1998, 2001, 2002, 2003 డీఎస్సీల్లో నియమితులైన వారు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులతోపాటు పదోన్నతులకు అవసరమని టెట్ రాసి ఉత్తీర్ణులయ్యారు.