తెలంగాణ

telangana

ETV Bharat / state

'క్షత్రియులు అన్ని రంగాల్లో దూసుకెళ్లాలి'

మన్నెం వీరుడు అల్లూరి జయంతి వేడుకలు హైదరాబాద్​లో ఘనంగా జరిగాయి. ట్యాంక్​ బండ్​పై విగ్రహానికి మంత్రి తలసాని పూలమాల వేసి నివాళులు అర్పించారు.

అల్లూరి సీతారామరాజు విగ్రహానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్​ నివాళి

By

Published : Jul 4, 2019, 1:56 PM IST

అల్లూరి సీతారామరాజు విగ్రహానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్​ నివాళి

విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 122వ జయంతిని క్షత్రియ సేవ సమితి హైదరాబాద్​లో ఘనంగా నిర్వహించింది. ట్యాంక్ బండ్​పై ఉన్న ఆయన విగ్రహానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్​తో పాటు సమితి నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలడించి దేశమత రక్షణకు ప్రాణం ఇచ్చి పోరాడిన... క్షత్రియ తేజం, విప్లవ వీరుడు అల్లూరి అని మంత్రి తలసాని కొనియాడారు. ఆయన పోరాట స్పూర్తితో క్షత్రియులు అన్ని రంగాల్లో ముందుకు సాగాలని ... అందుకు అవసరమైన సహాయ, సహకారాల కోసం ప్రభుత్వం అండగా ఉంటుందని తలసాని వారికి హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details