తెలంగాణ

telangana

ETV Bharat / state

స్వచ్ఛదర్పన్​ ఫేస్​-3 ర్యాంకుల్లో తెలంగాణ హవా

స్వచ్ఛదర్పన్​​ మూడో దశ సర్వేలో రాష్ట్రంలోని ఆరు జిల్లాలు దేశంలోనే మొదటి స్థానంలో నిలిచాయి. దేశవ్యాప్తంగా 700 జిల్లాల్లో నిర్వహించిన సర్వేలో ఎనిమిది జిల్లాలు మొదటి స్థానంలో నిలిచాయి. స్వచ్ఛ దర్పన్​ ఫేస్ - 3 ర్యాంకులను కేంద్ర తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య శాఖ ఇవాళ వెల్లడించింది.

స్వచ్ఛదర్పన్​ ఫేస్​-3 ర్యాంకుల్లో తెలంగాణ హవా

By

Published : Aug 17, 2019, 7:38 PM IST

Updated : Aug 17, 2019, 9:25 PM IST

దేశ వ్యాప్తంగా 700 జిల్లాల్లో నిర్వహించిన స్వచ్ఛదర్పన్​ మూడో విడత సర్వేలో ఎనిమిది జిల్లాలకు మొదటి ర్యాంకులో చోటు దక్కింది. ఇందులో ఆరు జిల్లాలు మనవే కావడం గర్వకారణం. వరంగల్ అర్బన్, జగిత్యాల, కామారెడ్డి, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలతో పాటు గుజరాత్ లోని ద్వారక, హర్యానాలోని రేవరీ జిల్లాలకు జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు దక్కింది. పూర్తిస్థాయి మరుగుదొడ్ల నిర్మాణం, వినియోగం, నిర్వహణ, కంపోస్టు పిట్స్, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలపై అవగాహన కల్పించడం.... జియో ట్యాగింగ్ పరిశీలన వంటి అంశాలపై దేశంలోని మొత్తం 700 జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వం సర్వే నిర్వహించింది. దేశంలోని ఎనిమిది జిల్లాలకు వందకు వంద మార్కులు నమోదయ్యాయి.

అధికారుల సమష్టి కృషితోనే సాధ్యమైంది

పల్లెలు పరిశుభ్రంగా ఉండాలన్న ముఖ్యమంత్రి లక్ష్యాలకు అనుగుణంగా చేపట్టిన కార్యాచరణతో మంచి ఫలితాలు వస్తున్నాయని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. స్వచ్ఛ దర్పన్​లో ఆరు జిల్లాలు ఉండడం గర్వకారణమన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల సమష్టి కృషితోనే ఇది సాధ్యమైందని వెల్లడించారు.

స్వచ్ఛదర్పన్​ ఫేస్​-3 ర్యాంకుల్లో తెలంగాణ హవా

ఇదీ చూడండి: బిల్లులు రాక ఆగిపోయిన మరుగుదొడ్ల నిర్మాణాలు

Last Updated : Aug 17, 2019, 9:25 PM IST

ABOUT THE AUTHOR

...view details