తెలంగాణ

telangana

ETV Bharat / state

రఘురామకు సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలకు సుప్రీం ఆదేశం

suprem court
సుప్రీం కోర్టు, రాఘురామకృష్ణరాజు

By

Published : May 17, 2021, 2:15 PM IST

Updated : May 17, 2021, 3:12 PM IST

14:13 May 17

రఘురామకు సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలకు సుప్రీం ఆదేశం

ఏపీ ఎంపీ రఘురామకృష్ణరాజుకు సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు చేయించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వైద్యపరీక్షల సమయాన్ని జ్యుడీషియల్‌ కస్టడీగా భావించాలని స్పష్టం చేసింది. వైద్య పరీక్షల పర్యవేక్షణకు న్యాయాధికారిని నియమించాలని చెప్పింది. న్యాయాధికారిని తెలంగాణ హైకోర్టు నియమించాలని తెలిపింది. ఆదేశాలు అమలయ్యేలా ఏపీ సీఎస్‌ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. వైద్య పరీక్షలను వీడియో తీయాలని, నివేదికను సీల్డ్ కవర్‌లో అందజేయాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఈనెల 21కి వాయిదా వేసింది.

అరికాళ్లకు తగిలిన గాయాలు

రఘురామకృష్ణరాజు బెయిల్‌ పిటిషన్‌తో పాటు ప్రైవేట్‌ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అంశంపై సుప్రీంకోర్టులో ఇవాళ వాదనలు జరిగాయి. రఘురామ తరఫున సీనియర్‌ న్యాయవాదులు ముకుల్‌ రోహత్గీ, ఆదినారాయణరావు.. ఏపీ ప్రభుత్వం తరఫున దుష్యంత్‌ దవే, వీవీ గిరి వాదనలు వినిపించారు. ప్రైవేట్‌ ఆస్పత్రిలో కూడా వైద్య పరీక్షలు చేయించాలని కింది కోర్టు ఆదేశించినా అధికారులు ఆ పనిచేయలేదని ముకుల్‌ రోహత్గీ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కస్టడీలో రఘురామను తీవ్రంగా కొట్టి హింసించారని.. అరికాళ్లకు తగిలిన గాయాలను ఎంపీ మెజిస్ట్రేట్‌కు చూపించారని తెలిపారు. 

మణిపాల్‌ ఆస్పత్రిలో పరీక్షలు చేయించండి
బెయిల్‌ మంజూరుతో పాటు ప్రైవేట్‌ ఆస్పత్రిలో వైద్యం అందించేందుకు ఆయనకు అవకాశం కల్పించాలని రోహత్గీ కోర్టును కోరారు.  రఘురామ వైద్యపరీక్షలకు విజయవాడ మణిపాల్‌ ఆస్పత్రి ఉందని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది దుష్యంత్‌ దవే తెలిపారు. కేవలం వైద్య పరీక్షలకు మాత్రమే అనుమతివ్వాలని.. ఆస్పత్రిలో అడ్మిషన్‌కు అవకాశం ఇవ్వొద్దని ఆయన కోరారు. అనంతరం విచారణను వాయిదా వేసిన సుప్రీంకోర్టు.. తాజాగా వైద్య పరీక్షలపై ఆదేశాలు జారీచేసింది.

ఇదీ చదవండి:మూడోదశ కరోనాను ఎదుర్కొనేందుకు సన్నద్ధమేనా : హైకోర్టు

Last Updated : May 17, 2021, 3:12 PM IST

ABOUT THE AUTHOR

...view details