తెలంగాణ

telangana

ETV Bharat / state

'జ్యోతిషం ప్రకారం తెలంగాణలో ముందస్తు ఎన్నికలు' - Supreme Court Latest News

Comments of Justice V Ramasubramanian: సుప్రీంకోర్టులో మంగళవారం గోషామహల్​ ఎమ్మెల్యే రాజాసింగ్​ అనర్హత వేటు పిటిషన్ విచారణ​ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌ చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీశాయి. ఇంతకీ ఆయన ఏం వ్యాఖ్యలు చేశాడంటే..!!

Comments of Justice V Ramasubramanian
Comments of Justice V Ramasubramanian

By

Published : Nov 30, 2022, 8:49 AM IST

Updated : Nov 30, 2022, 9:08 AM IST

Comments of Justice V Ramasubramanian: తెలంగాణలో ఎన్నికలు జ్యోతిషం ప్రకారం వస్తాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌ వ్యాఖ్యానించారు. గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై అనర్హత వేటు వేయాలంటూ తెరాస నేత ప్రేమ్‌సింగ్‌ రాథోడ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఈ పిటిషన్‌ జస్టిస్‌ ఎస్‌.రవీంద్ర భట్‌, జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది.

పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఇది 2018 ఎన్నికల నాటి పిటిషన్‌ అని, మరికొన్ని వివరాల సమర్పణకు 3 వారాల సమయం కావాలని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. ఈ దశలో జోక్యం చేసుకున్న జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌.. ‘‘తెలంగాణలో జ్యోతిషం ప్రకారం 2018లో ముందస్తుగా ఎన్నికలు వచ్చాయి. అలాగే ఈ కేసు విచారణకూ గ్రహాలన్నీ ఒకే వరుసలోకి రావాలి కావచ్చు’’ అంటూ వ్యాఖ్యానించారు. విచారణను జనవరికి వాయిదా వేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Nov 30, 2022, 9:08 AM IST

ABOUT THE AUTHOR

...view details