ఆంధ్రప్రదేశ్లోని విశాఖ ఎల్జీ పాలిమర్స్ వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ మేరకు ఎల్జీ పాలిమర్స్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. హరిత ట్రైబ్యునల్ ఇచ్చిన ఆదేశాల మేరకు రూ.50 కోట్లు జమ చేసినట్లు సర్వోన్నత న్యాయస్థానానికి తెలిపారు. ఘటనపై విచారణ జరిపేందుకు ఎన్జీటీకి అధికారం లేదని... వాదనలు వినిపించగా అవన్నీ అక్కడే తేల్చుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది. విచారణాధికారంపై హరిత ట్రిబ్యునల్లో లేవనెత్తే అవకాశం ఇచ్చింది. జూన్ 1న హరిత ట్రైబ్యునల్లో విచారణ తరువాత మరోసారి వాదనలు వింటామని సుప్రీంకోర్టు తెలిపింది. అనంతరం తదుపరి విచారణ జూన్ 8కి వాయిదా వేసింది.
ఎల్జీ పాలిమర్స్ పిటిషన్పై సుప్రీంలో విచారణ - సుప్రీంలో ఎల్జీ పాలిమర్స్ పిటిషన్ వార్తలు
ఏపీ హైకోర్టు, ఎన్జీటీ ఆదేశాలను సవాల్ చేస్తూ ఎల్జీ పాలిమర్స్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించింది. తదుపరి విచారణను జూన్ 8కి వాయిదా వేసింది.
ఎల్జీ పాలిమర్స్ పిటిషన్పై సుప్రీంలో విచారణ