జనతా కర్ఫ్యూనకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావడం హర్షనీయమని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ అన్నారు. సైబరాబాద్ పరిధిలో కరోనా వైరస్ విస్తరించకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఇతర శాఖలతో సమన్వయం చేసుకుని ముందుకెళ్తున్నట్లు చెప్పారు.
కరోనా వైరస్ వ్యాప్తిని నిలువరించేందుకు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలకు స్వచ్ఛందంగా సహకరించాలని కోరారు. ఈ మేరకు ఇప్పటికే ఐటీ కంపెనీల ప్రతినిధులకు విజ్ఞప్తి చేశామన్నారు. అంతర్జాతీయ విమానాల రాకపోకలు నిలిచిపోగా విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయంలోనే స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం క్వారంటైన్‌కు తరలిస్తున్నట్లు స్పష్టం చేశారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్‌తో మా ఈటీవీ ప్రతినిధి తిరుపాల్ రెడ్డితో ముఖాముఖి.