తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉన్నత విద్యపై సదస్సు

'ఉన్నత విద్య, మానవ వనరులు' పేరుతో ఈనెల 4, 5 తేదీల్లో హైదరాబాద్​లో ఉన్నత విద్యామండలి రెండురోజుల సదస్సు నిర్వహించనుంది.

higher

By

Published : Feb 3, 2019, 10:48 AM IST

ఉన్నత విద్యామండలి
ఉన్నత విద్య, పరిశ్రమల అవసరాల మధ్య అంతరాన్ని తగ్గించే చర్యల్లో భాగంగా హైదరాబాద్​లో రెండు రోజుల సదస్సు నిర్వహించనున్నారు. ఉన్నత విద్యా మండలి, సాంకేతిక విద్యా, ఇంటర్మీడియెట్ బోర్డు సంయుక్తంగా మారియట్ కన్వెన్షన్ కేంద్రంలో ఈనెల 4, 5 తేదీల్లో 'ఉన్నత విద్య, మానవ వనరులు' పేరుతో ఏర్పాట్లు చేస్తున్నారు.

యాభై సంస్థల మానవ వనరుల విభాగాల ప్రతినిధులు, విద్యావేత్తలు హాజరు కానున్నట్లు ఉన్నత విద్యా మండలి వైస్ ఛైర్మన్ ఆచార్య లింబాద్రి, కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ తెలిపారు. రెండు రోజుల సదస్సుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో పాటు గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల నుంచి హాజరవుతారని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details