రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా సాగుతోందని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. గడచిన 24 గంటల్లో 1,08,255 మందికి వ్యాక్సిన్ ఇచ్చామని ప్రకటించింది. 96,273 మందికి తొలిడోస్ ఇవ్వగా.. 11,982 మంది రెండో డోస్ తీసుకున్నారని తెలిపింది.
Vaccination: రాష్ట్రవ్యాప్తంగా సజావుగా వ్యాక్సినేషన్ ప్రక్రియ - వ్యాక్సినేషన్ వార్తలు
రాష్ట్ర వ్యాప్తంగా 50,05,265 మంది తొలిడోస్ వ్యాక్సిన్ తీసుకున్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు కేంద్రం నుంచి రాష్ట్రానికి 65,16,000 వ్యాక్సిన్ డోసులు రాగా... 64, 27,137 డోస్‌లు వినియోగించినట్లు స్పష్టం చేసింది.
వ్యాక్సినేషన్‌లో హెల్త్‌కేర్ వర్కర్లు 574, ఫ్రంట్ లైన్ వర్కర్లు 148 మంది ఉండగా.. 18నుంచి 44 ఏళ్ల మధ్య ఉన్నవారు 82,014 మంది టీకాలు తీసుకున్నారు. 45 ఏళ్లు పైబడిన వారు 25,519మంది వ్యాక్సిన్ వేసుకున్నారని వైద్యారోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 50,05,265మంది తొలిడోస్ వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నారు. 14,21,872 మంది రెండు డోస్‌లు తీసుకున్నారు. రాష్ట్రానికి 65,16,000 వ్యాక్సిన్ డోస్‌లు అందగా.. 64,27,137 డోస్‌లు వినియోగించామని వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో 18ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ పుంజుకుంటోంది.. వారం, పది రోజుల్లో మరింత వేగవంతమయ్యే అవకాశం ఉంది.
ఇదీ చూడండి:Black fungus: నిండుకుంటున్న బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్లు