తెలంగాణ

telangana

ETV Bharat / state

యువతుల్లో అభద్రతా భావంపై రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు

రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు, యువతుల్లో అభద్రతా భావాన్ని తొలిగించేందుకు పోలీసు విభాగం, ప్రాసిక్యూసన్స్​ డైరెక్టరేట్​లు సదస్సులు నిర్వహిస్తున్నాయి. అత్యవసర సమయాల్లో 100కు ఫోన్​ చేయడం, హాక్​ ఐ యాప్​ వినియోగంపై అధికారులు వివరించారు.

యువతుల్లో అభద్రతభావంపై రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు
యువతుల్లో అభద్రతభావంపై రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు

By

Published : Dec 8, 2019, 6:41 AM IST

Updated : Dec 8, 2019, 8:05 AM IST


దిశ ఘటన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, యువతుల్లో అభద్రతా భావాన్ని తొలగించేందుకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. పోలీసు విభాగం, ప్రాసిక్యూసన్స్ డైరెక్టరేట్​లు సదస్సులు నిర్వహించాయి. మహిళా కళాశాలలు, విద్యాసంస్థల్లో నిర్వహించిన ఈ కార్యక్రమాలకు ఆయా జిల్లాల పోలీస్ అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు హాజరయ్యారు.

మహిళలు, పిల్లల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా పోలీస్ శాఖ చేపట్టిన చర్యల గురించి అధికారులు వివరించారు. అత్యవసర సమయాల్లో డయల్ 100కు ఫోన్ చెయడం, హాక్ ఐ మొబైల్ యాప్​ను వినియోగించడంపై అవగాహన కల్పించారు. బాలలు, మహిళలకు చట్ట పరమైన హక్కులపై ఈ సదస్సులో తెలియజేశారు. విద్యార్థినులు అడిగిన పలు సందేహాలకు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సమాధానం ఇచ్చారు. ఈ తరహా సదస్సులను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థల్లో నిర్వహించే విధంగా ప్రణాళిక రచిస్తున్నారు.

యువతుల్లో అభద్రతా భావంపై రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు

ఇవీ చూడండి:'మహిళలకు డయల్​ 100పై అవగాహన అవసరం'

Last Updated : Dec 8, 2019, 8:05 AM IST

ABOUT THE AUTHOR

...view details