ఆంధ్రప్రదేశ్‌లో నమోదైన ఓటర్ల తుది జాబితాను ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు ఓ నోటిఫికేషన్ని విడుదల చేసింది. ఏపీలో 2021 జనవరి 15 నాటికి.. 4 కోట్ల 4 లక్షల 41 వేల 378 ఓటర్లు ఉన్నట్టు తెలిపింది. దీనిలో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండడం విశేషం.
ఓటర్ల వివరాలు..
- మహిళా ఓటర్లు 2 కోట్ల 4 లక్షల 71 వేల 506.
- పురుష ఓటర్లు 1 కోటి 99 లక్షల 66 వేల 737.
- సర్వీసు ఓటర్లు 66 వేల 844 .
- ధర్డ్ జెండర్ ఓటర్లు 4,135
2021 జనవరి నాటికి కొత్తగా.. 4 లక్షల 25 వేల 860 మంది (1.06 శాతం) ఓటర్లు పెరిగారని ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి విజయానంద్ వెల్లడించారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి 1,500 మంది ఓటర్ల చొప్పున నమోదు అయ్యారనీ.. ప్రస్తుతం రాష్ట్రంలో 45 వేల 917 పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు ఈసీ తెలిపింది.