తెలంగాణ

telangana

ETV Bharat / state

'పప్పుదినుసులు, చిరుధాన్యాల ఉత్పత్తిపై దృష్టి పెట్టాలి'

వాతావరణ మార్పుల నేపథ్యంలో చిరుధాన్యాలు, పప్పు దినుసులే ఆరోగ్యానికి మంచివని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ పప్పుధాన్యాల దినోత్సవం పురస్కరించుకుని హైదరాబాద్ నాంపల్లి రెడ్ హిల్స్ ఫ్యాప్సీ భవన్​లో పప్పుధాన్యాల ఉత్పత్తి, వ్యాపార అవకాశాలపై రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి నిరంజన్​ రెడ్డి హాజరయ్యారు.

'పప్పుదినుసులు, చిరుధాన్యాల ఉత్పత్తిపై దృష్టి పెట్టాలి'
'పప్పుదినుసులు, చిరుధాన్యాల ఉత్పత్తిపై దృష్టి పెట్టాలి'

By

Published : Feb 10, 2021, 5:41 PM IST

హైదరాబాద్​ నాంపల్లి రెడ్​హిల్స్​ ఫ్యాప్సీభవన్​లో పప్పుధాన్యాల ఉత్పత్తి, వినియోగం, వ్యాపార అవకాశాలపై రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి నిరంజన్​ రెడ్డి హాజరయ్యారు. భారతదేశంలో పప్పుధాన్యాల పంటల సాగు, ఉత్పత్తి, ఉత్పాదకత, శుద్ధి, నిల్వ, మార్కెటింగ్, అదనపు విలువ జోడింపు, ఆహారోత్పత్తుల తయారీ, విదేశీ ఎగుమతులు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.

గతంలో పప్పుధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించినప్పటికీ... కాలక్రమేణా ఇతర దేశాలపై ఆధారపడాల్సి వస్తోదని నిపుణులు పేర్కొన్నారు. ప్రాచీన ఆహార అలవాట్లే ఆరోగ్యానికి మేలని... రసాయన ఎరువులు, క్రిమిసంహార మందుల వాడకం తగ్గిస్తూ పప్పు దినుసులు, చిరుధాన్యాలు పండించాలని మంత్రి నిరంజన్‌రెడ్డి సూచించారు. రాష్ట్రంలో కందులు, ఆయిల్‌పాం పంటలు సాగు పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ప్రజలకు అవసరంలేని పంటలు సాగుచేయొద్దని సూచించారు. డిమాండ్, అవసరాలకు అనుగుణంగా ముందుకెళ్లాలని తెలిపారు. కార్యక్రమంలో నాబార్డ్ సీజీఎం వై.కృష్ణారావు, సుస్థిర వ్యవసాయ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ జీవీ రామాంజనేయులు, ఎఫ్‌టీసీసీఐ ప్రతినిధులు రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు.

'పప్పుదినుసులు, చిరుధాన్యాల ఉత్పత్తిపై దృష్టి పెట్టాలి'

ఇదీ చూడండి:భాగ్యనగరంలో కజికిస్థాన్ దౌత్యకార్యాలయం ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details