తెలంగాణ

telangana

ETV Bharat / state

'స్థానిక సంస్థలకు కేంద్ర ఆర్థికసంఘం నిధులు విడుదల చేయాలి' - స్థానిక సంస్థలు

స్థానిక సంస్థలకు కేంద్ర ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయాలని రాష్ట్ర పైనాన్స్​ కమిషన్​ అధ్యక్షుడు రాజేశం గౌడ్​ కోరారు. స్థానిక సంస్థల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్​కుమార్​ తెలిపారు.

రాష్ట్ర ఆర్థిక సంఘం

By

Published : Aug 29, 2019, 11:29 PM IST

'కేంద్రం స్థానిక సంస్థలకు నిధులు విడుదల చేయాలి'

కేంద్ర ఆర్థిక సంఘం... స్థానిక సంస్థలకు నిధులను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ఫైనాన్స్​ కమిషన్​ అధ్యక్షుడు రాజేశం గౌడ్​ డిమాండ్​ చేశారు. హైదరాబాద్​ ఇంజినీర్స్​ భవన్​లో జరిగిన సమావేశంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్​కుమార్​, మండల ప్రజా పరిషత్​ అధ్యక్షులు పాల్గొన్నారు. స్థానిక సంస్థలకు రూ.1400 కోట్ల నిధులను విడుదల చేయాలని కేంద్రాన్ని కోరినట్లు రాజేశం గౌడ్​ తెలిపారు.

ప్రాధామ్యాల ప్రకారం నిధులు ఖర్చు చేయాలి

స్థానిక సంస్థల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని... ఈ సందర్భంగా విడుదలయ్యే నిధులను ప్రాధామ్యాల ప్రకారం ఖర్చు చేయాలని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్​కుమార్​ ఎంపీపీలకు సూచించారు. 2003లో అప్పటి ఫైనాన్స్​ కమిషన్​ ఆధారంగానే నిధుల కేటాయింపు ఉంటుందని... కొత్త సూచనలతో ఎంపీపీలు ముందుకు రావాలని అన్నారు.

ఇదీ చూడండి : 'యుద్ధ ప్రాతిపదికన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తవ్వాలి'

ABOUT THE AUTHOR

...view details