ఉచితంగా ప్రయాణ సౌకర్యం
విద్యార్థులు సమాధానాలు రాసేందుకు మెయిన్, అడిషనల్, గ్రాఫ్ షీట్లను ఇప్పటికే కేంద్రాలకు పంపించినట్లు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు విజయ్ కుమార్ తెలిపారు. మాల్ ప్రాక్టీస్, కాపీయింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా 140 ఫ్లయింగ్ స్క్వాడ్లు.. హైదరాబాద్‌లోని ప్రభుత్వ పరీక్షల సంచాలకుడి కార్యాలయం నుంచి నలుగురు ప్రత్యేక ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించారు. హాల్ టికెట్ చూపించి ఆర్టీసీ బస్సుల్లో విద్యార్థులు ఉచితంగా ప్రయాణం చేయవచ్చునని పేర్కొన్నారు.
ఆలస్యమైనా... రావొచ్చు
పరీక్ష ప్రారంభ సమయం ఉదయం తొమ్మిదిన్నర అయినప్పటికీ... తర్వాత ఐదు నిమిషాల వరకు లోనికి అనుమతిస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఉదయం 8 గంటల 45 నిమిషాల వరకే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ప్రశ్నపత్రం లీకైందని పుకార్లు వస్తుంటాయని.. వాటిని నమ్మవద్దని తల్లిదండ్రులు, విద్యార్థులను కోరారు.