SR Nagar Drugs Case Latest Update: కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో డ్రగ్స్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పరిధిలో డ్రగ్స్ కేసులో టీఎస్ న్యాబ్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే నెల్లూరికి చెందిన ఆశిక్, దుడ్డు రాజేష్‌లను అరెస్టు చేసిన పోలీసులు నిందితుల నుంచి 34 ఎక్ట్సాసి పిల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఆర్ నగర్ పరిధిలో జరిగిన రేవ్ పార్టి కోసం 32 ఎక్ట్సాసి పిల్స్ వినియోగించినట్లు గుర్తించిన టీఎస్ న్యాబ్ పోలీసులు రేవ్ పార్టీకి హాజరైన పది మందిలో ముగ్గురికి డ్రగ్ పరీక్షలో పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు.
TSNAB Police Found Drugs At YSRCP Leader's Son Rave Party : గోవాలో హనుమంత్ బాబుసో దివాకర్ అలియాస్ బాబా అనే వ్యక్తి వద్ద రూ.1000 నుంచి రూ.1200లకు ఒక్కో ఎక్స్టాసిపిల్స్ కొనుగోలు చేసిన నిందితులు రాజేష్, ఆశిక్లు ఇక్కడ అధిక ధరకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిచ్చిన సమాచారంతో నాలుగు రోజుల కిందట గోవాలో బాబాను అరెస్ట్ చేసిన టీఎస్ న్యాబ్ పోలీసులు బాబానే హైదరాబాద్‌కు ప్రధాన సరఫరాదారుడుగా గుర్తించారు.
అంతరాష్ట్ర గంజాయి ముఠా అరెస్టు - రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత దిశగా చర్యలు
ఆశిక్, రాజేష్ అరెస్టు చేసి విచారిస్తున్న సమయంలో తరచూ తన వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసే ఫిల్మ్ నగర్‌లోని స్వదీప్ అనే డీజె ఆపరేటర్‌ను బాబా అప్రమత్తం చేశాడు. విచారణలో భాగం వారం రోజుల కిందట స్వదీప్ రూ.1.4లక్షలతో 14 గ్రాముల కొకైన్ ను బాబా నుంచి కొనుగోలు చేసినట్లు తేలింది. ఈ కేసులోనే నెల్లూరు ఉడా ఛైర్మన్ కుమారుడు ప్రేమ్ చంద్ సహా 12 మందికి ఎస్ఆర్ నగర్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ప్రేమ్ చంద్‌ను కేసులో ఎ38గా చేర్చారు.
''మాదకద్రవ్యాల ముఖ్య సరఫదారు గోవాలో ఉన్నట్లు గుర్తించాం. అతని పేరు హనుమత్ బాబుసోదివకర్. గోవాలో పెద్ద మద్యం దుకాణదారుడు. మూడేళ్ల నుంచి డ్రగ్స్ దందా చేస్తున్నాడు. హైదరాబాద్‌లో 25 మందికి సరుకు చేరవేస్తున్నాడు. వారు మరో 25 మంది వినియోగదారులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించాం. నాలుగు రోజుల పరిశీలన తర్వాత దివకర్ను అరెస్టు చేశాం. దేశం మొత్తంలో ఆరుగురు బడా డ్రగ్స్ సరఫదారులున్నట్లు గుర్తించాం. ఆ ఆరుగురు పెద్ద వ్యాపారులపైనా ప్రత్యేక దృష్టిసారించాం.'' - సందీప్ శాండిల్య టీఎస్ న్యాబ్, డైరెక్టర్