రైల్వే అధికారులు ఏపీలోని కర్నూలు జిల్లా నంద్యాల మీదుగా గరీబ్ రథ్ ప్రత్యేక రైలు సౌకర్యాన్ని కల్పించారు. పూరీ నుంచి యశ్వంతపూర్ ప్రాంతానికి.. యశ్వంతపూర్ నుంచి పూరీ ప్రాంతానికి శని, ఆదివారాల్లో ఈ రైలును నడపనున్నారు.
- గరీబ్ రథ్ రైలు( రైలు నంబరు 02063) నంద్యాల రైల్వేస్టేషన్‌కు ఈ నెల 16న ఉదయం 11 గంటలకు చేరుకొని 11.05కు యశ్వంతపూర్‌కు బయల్దేరుతుంది.
- ఇదే రైలు( రైలు నంబరు 02064) 17న(ఆదివారం) ఉదయం 7 గంటలకు నంద్యాల చేరుకుని 7.05కి పూరీ బయల్దేరుతుంది.
- గరీబ్ రథ్ రైలు ఈ నెల 15న( శుక్రవారం) మధ్యాహ్నం 3.15కు బయల్దేరి.. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నంద్యాల, డోన్, అనంతపురం, హిందూపురం మీదుగా యశ్వంతపూర్‌కు 16( శనివారం) రోజు రాత్రి చేరుకుంటుంది.
- అదే రోజు రాత్రి 10.40కి యశ్వంతపూర్‌లో బయల్దేరి నంద్యాలకు 17వ తేది(ఆదివారం) ఉదయం 7 గంటలకు చేరుకుంటుంది. తిరిగి 7.05 నిమిషాలకు బయల్దేరి సోమవారం తెల్లవారుజామున 3.55కి పూరీ చేరుకుంటుంది.