తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆస్తి కోసం అమ్మనే అంతమొందించాడు - తప్పించుకుందామనుకున్నా దొరికిపోయాడు - mother murder son news

Son Killed His Mother In Hyderabad : ఆస్తి కోసం మనుషులు రక్కసులుగా మారుతున్నారు. కన్నవారిని, కట్టుకున్న వారిని సైతం కడతేర్చడానికి సిద్ధమౌతున్నారు. అత్యాశకు పోయి ఆఖరికి బంధాలను తెంచేందుకు సైతం వెనకాడటం లేదు. ఆస్తి వస్తుంది అంటే నవమాసాలు మోసిన తల్లి ప్రాణాన్ని తీసేంత కసాయిలుగా మారిపోతున్నారు. ఇదే కోవలో హైదరాబాద్ రామంతపూర్‌లో నగరం ఉలిక్కి పడేలా జరిగిన ఓ ఘటన స్థానిక ప్రజలను నివ్వెరపోయేలా చేసింది.

Son Killed Mother For Property In Ramanthapur
Son Killed His Mother In Hyderabad

By ETV Bharat Telangana Team

Published : Jan 8, 2024, 9:34 AM IST

ఆస్తికోసం అమ్మ గొంతు నులిమేశాడు ఓ కసాయి - నగరాన్ని ఉలిక్కి పడేలా చేసిన ఘటన

Son Killed His Mother In Hyderabad : గోరు ముద్దలు తినిపించి, గొప్పగా బతకాలి నాన్న అని చెప్పిన తల్లి మాటలు ఆ కసాయి వ్యక్తి చెవికి ఎక్కలేదు సరికదా! ఆఖరికి ఆస్తి కోసం భార్య, స్నేహితుడితో కలిసి కన్న తల్లినే కడతేర్చే వరకూ పోయింది. ఇంటిని అమ్మేందుకు అడ్డుగా ఉందని అమ్మను చంపిన కుమారుడిని హైదరాబాద్‌లోని(Hyderabad) ఉప్పల్ పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. ఉప్పల్ ఠాణా పరిధిలోని రామంతపూర్ వెంకట్‌రెడ్డి నగర్‌లో జరిగిన దారుణం ఇది. సుగుణమ్మ అనే వృద్ధురాలు తన కుమారుడు అనిల్, కోడలు తిరుమలతో కలిసి వెంకటరెడ్డి నగర్‌లో నివాసం ఉంటుంది. 5 ఏళ్ల క్రితం ఇంటిని తన పేరిట రాయాలని కోడలు తిరుమల ఒత్తిడి తేవడంతో చేసేదేమీ లేక సుగుణమ్మ ఇంటిని తిరుమల పేరిట రాసింది.

నిజామాబాద్​ ఘటనలో ఆరుగురి మృతదేహాలు లభ్యం, పోస్ట్​మార్టం​తో మరిన్ని సాక్ష్యాధారాల సేకరణ

Son Killed Mother For Property In Ramanthapur, Hyderabad : అప్పటి నుంచి ఆ పత్రాలు ఎక్కడ ఉన్నాయో చెప్పకుండా తిరుమల కాలం వెల్లదీస్తుందని, ఆ పత్రాలు అడిగిన నేపథ్యంలోనే గొడవ జరిగిందని బంధువులు తెలిపారు. అటు ఆ ఇంటిని అమ్మేయాలని చూస్తున్న అనిల్ తిరుమల దంపతుల నిర్ణయాన్ని సుగుణమ్మ వ్యతిరేకించింది. అంతే, అదే ఆ తల్లి పాలిట యమ పాశమైంది. ఇంటిని అమ్మడానికి సుగుణమ్మ ఒప్పుకోకపోవడంతో భార్య తిరుమల, స్నేహితుడు శివతో కలిసి కుమారుడు అనిలే కన్నతల్లిని కడతేర్చాడు. ఈ నెల 4వ తేదీన సుగుణమ్మ నిద్రిస్తున్న సమయంలో ముఖంపై దిండు పెట్టి, టవల్‌ గొంతుకి చుట్టి హత్య చేశారు. తరువాత విషయం తెలుసుకున్న సుగుణమ్మ తల్లి ఐలమ్మ, కుమార్తె అంత్యక్రియలకు వెంకట్‌రెడ్డి నగర్ చేరుకుంది.

కానిస్టేబుల్​ భర్త ఇంటి ముందే భార్య అంత్యక్రియలు- కూతురిని హత్య చేశాడని తల్లిదండ్రుల కోపం!

Police Registered A Case And Investigating :స్నానం చేయిస్తున్న సమయంలో చెవుల వెనకాల, మెడ ప్రాంతంలో కమిలిన గాయాలు ఉండడంతో బంధువులు అనిల్‌ను గట్టిగా నిలదీయడంతో భార్య, మిత్రుడితో కలిసి సుగుణమ్మను అంతం చేసినట్లు ఒప్పుకున్నాడు. తర్వాత ఐలమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు సీన్​ రీ కన్​స్ట్రక్షన్​ చేశారు. ఆస్తి కోసమే తల్లిని చంపారా? ఇందులో ఇంకా వేరే ఏవైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ తల్లిని ఆస్తి కోసం చంపడంతో స్థానికులే కాదు, చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే ప్రజలూ నివ్వెరపోతున్నారు.

Constable Committed Suicide After killing his Family: రెండో భార్య పేరిట ఆస్తులు.. మొదటి భార్య, ఇద్దరు పిల్లలను తుపాకితో కాల్చిచంపి.. కానిస్టేబుల్‌ ఆత్మహత్య

A Girl Killed her Mother Along With Boyfriend: దత్త పుత్రిక దాష్టీకం.. ప్రియుడితో కలిసి తల్లిని హతమార్చిన బాలిక

ABOUT THE AUTHOR

...view details