తెలంగాణ

telangana

ETV Bharat / state

ట్వీట్ వార్: విజయసాయి వర్సెస్ సోము వీర్రాజు! - ap news

వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి, భాజపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు... ట్విట్టర్‌ వేదికగా విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్నారు. భాజపా డ్రామాలకు జనం నవ్వుకుంటున్నారని విజయసాయి ట్వీట్ చేస్తే... తాము ఎన్నికల్లో గెలిచాక విజయసాయికి క్యాబేజీ పూలు పంపిస్తామని సోము వీర్రాజు వ్యంగ్యంగా స్పందించారు.

ycp mp vijay sai, state bjp president, somu veerraju
twitter war - somu, vijay sai

By

Published : Mar 29, 2021, 7:52 PM IST

ఏపీలోని తిరుపతి ఉప ఎన్నికకు ముందు భాజపా నేతలపై వైకాపా ఎంపీ విజయసాయి తీవ్ర విమర్శలు చేశారు. భాజపా డ్రామాలకు జనం నవ్వుకుంటున్నారని విజయసాయి ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్​కు ఏపీ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఘాటుగా స్పందించారు. "మేం ఏం ఇచ్చామో చెప్పి ఎన్నికల్లో గెలుస్తాం" అని ధీమా వ్యక్తం చేశారు. గెలిచాక విజయసాయికి క్యాబేజీ పూలు పంపిస్తామన్నారు. కోర్టులను తప్పుదోవ పట్టిస్తూ.. విజయసాయి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని.. బెయిల్‌ రద్దవగానే క్యాబేజీ పూలు కూరకు లోపల పనికొస్తాయని అంటూ.. సోము వీర్రాజు ఎద్దేవా చేశారు.

ఇదీ చూడండి:కేసీఆర్ అండ, నాన్న కృషే నన్ను గెలిపిస్తాయి: నోముల భగత్

ABOUT THE AUTHOR

...view details