తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ అస్థిపంజరాలు ఎవరివో తెలిసిపోయింది

హిమాలయ పర్వతాలలోని రూప్​కుంద్ సరస్సు మిస్టరీ ఛేదించే దిశగా సీసీఎంబీ చేసిన ప్రయోగాలు కొంతమేర ఫలితాలను ఇచ్చాయని సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్​ మిశ్రా ప్రకటించారు. ఈ మేరకు సీసీఎంబీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ రాకేష్ మిశ్రాతో పాటు ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ తంగరాజ్ పాల్గొన్నారు.

అస్తిపంజరాలు

By

Published : Aug 21, 2019, 8:43 AM IST

Updated : Aug 21, 2019, 10:37 AM IST

ఆ అస్థిపంజరాలు ఎవరివో తెలిసిపోయింది

హిమాలయ పర్వతశ్రేణుల్లో ఉన్న రూప్‌కుంద్‌ సరస్సులోని అస్థిపంజరాల గుట్టువీడింది. జన్యుపరిశోధనల ఆధారంగా ఇవి విభిన్న జాతులకు చెందినవిగా శాస్త్రవేత్తలు గుర్తించారు. భారతీయులతోపాటు మధ్యధరా, ఆగ్నేయ ఆసియా ప్రాంతానికి చెందినవారి అవశేషాలివని హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యూలార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) తాజా పరిశోధన నిర్ధరించింది. ప్రతిష్ఠాత్మక ‘నేచర్‌ కమ్యూనికేషన్స్‌’ జర్నల్‌లో మంగళవారం ఈ పరిశోధన ప్రచురితమైంది.

గత పదేళ్లుగా రూప్​కుంద్​లోని అస్థిపంజరాలపై తంగరాజ్ పరిశోధనలు చేస్తున్నారు. అక్కడి నమూనాలను సేకరించిన సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్​ మిశ్రా... వాటి డీఎన్​ఏ, మైటోఖాండ్రియాపై పరిశోధించారు. అస్థిపంజరాల సరస్సుగా పేరు పొందిన రూప్​కుంద్​లో చెల్లా చెదురుగా కనిపించే అస్థిపంజరల్లో స్త్రీ, పురుషులు ఇద్దరివి ఉన్నాయని గుర్తించారు. అవి కేవలం ఒక ప్రాంతం, ఒక తెగవి కాదని డీఎన్ఏ పరీక్షల్లో తేలినట్లు ప్రకటించారు.

72 ఆస్థిపంజరాలు

మొత్తం 72 ఆస్థిపంజరాల డీఎన్ఏని పరీశీలించిన డాక్టర్ తంగరాజ్.... అందులో కొన్ని భారతీయులవి కాగా... మిగతావి గ్రీస్, చైనీస్, ఇరానియన్​లవని తేల్చారు. ఇక ఈ పరిశోధన ద్వారా రూప్​కుంద్​లోని అస్థిపంజరాలపై సంబంధించి ప్రచారంలో ఉన్న కథలు సరైనవి కావని... బహుశా అవి నందాదేవి దర్శనానికి వచ్చే భక్తులవి అయ్యి ఉండొచ్చని అంచనాకు వచ్చినట్టు తెలిపారు. రూప్​కుంద్​లోని మరిన్ని అస్థిపంజారాలపై పరిశోధన జరగాలని ఆయన పేర్కొన్నారు.

ఇదీ చూడండి: వామ్మో..! ఆ ఇంటికి 75 గదులు... 101 దర్వాజలు...

Last Updated : Aug 21, 2019, 10:37 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details