తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్లాస్టిక్ రహిత సమాజమే ఈ అక్కాచెల్లెళ్ల లక్ష్యం! - hyderabad sister plastic eradication

ప్లాస్టిక్​ మనందరి రోజువారీ జీవితాల్లో చొచ్చుకుపోయింది. దాన్ని అరికట్టాలని అందరూ అనుకుంటున్నా అందుకు కృషి చేసేవారు అరుదుగా కన్పిస్తున్నారు. హైదరాబాద్​కు చెందిన అక్కాచెల్లెళ్లు ప్రజ్ఞ, మృదు నాగోరి ప్లాస్టిక్​ను నివారించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఈ మహమ్మారి నుంచి ప్రత్యామ్నాయాలను సమాజానికి అలవాటు చేస్తున్నారు.

sisters_working_well_on_plastic eradication
ప్లాస్టిక్ రహిత సమాజమే ఈ అక్కాచెల్లెళ్ల లక్ష్యం!

By

Published : Jan 4, 2020, 5:51 AM IST

ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించాలన్నదే ఈ అక్కా చెల్లెళ్ల నినాదం. హైదరాబాద్​కు చెందిన ప్రజ్ఞా నాగోరి, మృదు నాగోరి ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరాలు చదువుతున్నారు. ప్లాస్టిక్​కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కేరళ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తెలంగాణ రాష్ట్రాల్లో పర్యటిస్తూ ప్రచారం నిర్వహించారు. అక్కడి ఇంటర్ విద్యార్థులకు ప్లాస్టిక్ నిషేధించాల్సిన ఆవశ్యకతపై అవగాహన కల్పించారు.

వ్యర్థాలను సేకరించి వాటితో సరికొత్త ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. పాత దుస్తులను సేకరించి మహిళలకు సంచులు కుట్టేందుకు ఇస్తూ ఉపాధి కల్పిస్తున్నారు.

ప్లాస్టిక్​ని పూర్తిగా నిషేధించలేకపోయినా.. కనీసం తగ్గించాలంటున్న వీరు ఉర్ఘా పేరుతో ఓ యూత్​ గ్రూపు నిర్వహిస్తున్నారు. పూర్తిస్థాయిలో కంపెనీ ఏర్పాటు చేసుకునేందుకు 18 ఏళ్లు ఎప్పుడు నిండుతాయా అని ఎదురుచూస్తున్న ఈ చిచ్చరపిడుగులతో ఈటీవీ భారత్​ ప్రత్యేక ముఖాముఖి...

ప్లాస్టిక్ రహిత సమాజమే ఈ అక్కాచెల్లెళ్ల లక్ష్యం!

ఇదీ చదవండిః ఈ సంతలో వాహనాలూ దొరుకుతాయ్!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details