తెలంగాణ

telangana

ETV Bharat / state

ఫెయిల్​ అవడంలో మనం​ నంబర్​వన్​: షబ్బీర్​ అలీ

కేసీఆర్ ప్రసంగంపై గాంధీభవన్​లో కాంగ్రెస్​ నేత షబ్బీర్​ అలీ ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి మాయమాటలు చెప్పి ప్రజల్ని మభ్యపెడుతున్నారని మండిపడ్డారు.

వి ఆర్​ నంబర్​ వన్​ కాదు: షబ్బీర్​ అలీ

By

Published : Jun 2, 2019, 12:45 PM IST

రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకుపోతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ అబద్ధాలు చెబుతూ ప్రజల్ని మోసం చేస్తున్నారని కాంగ్రెస్​ ఎమ్మెల్సీ నేత షబ్బీర్​ అలీ ఆరోపించారు. గాంధీభవన్​లో రాష్ట్ర ఆవిర్భావ సంబురాల్లో పాల్గొన్న ఆయన... కేసీఆర్ సర్కారు పనితీరుపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి 'వి ఆర్​ నంబర్​ వన్' అని చెప్పి ప్రజల్ని మభ్య పెడుతున్నారని పేర్కొన్నారు. పట్టపగలే హత్యలు, మానభంగాలు జరుగుతున్నాయని, కేసీఆర్ లా అండ్​ అర్డర్​ సక్రమంగా ఉందనడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వి ఆర్​ నంబర్​ వన్​ కాదు: షబ్బీర్​ అలీ

ABOUT THE AUTHOR

...view details