ఇండ్లు, పనిచేసే స్థలాలు, ప్రయాణాల్లో మహిళలు, బాలికల భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక ఉపసంఘాలు ఏర్పాటు చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని మహిళా అధికారులు ప్రభుత్వానికి సూచించారు. ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ అధ్యక్షతన బీఆర్కే భవన్ లో మహిళలు, బాలికల భద్రత కమిటీ సమావేశమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు కమిటీని ఏర్పాటు చేశారు.
'మహిళల భద్రత కోసం ఉపసంఘాలు ఏర్పాటు చేయండి'
మహిళలు, బాలికల భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక ఉపసంఘాలు ఏర్పాటు చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని మహిళా అధికారులు ప్రభుత్వానికి సూచించారు.
ఐఏఎస్ అధికారులు స్మితాసభర్వాల్, యోగితారాణా, క్రిస్టినా, వాకాటి కరుణ, దివ్య, ఐపీఎస్ అధికారి సుమతి, ఐఎఫ్ఎస్ అధికారి ప్రియాంక వర్గీస్ సమావేశంలో పాల్గొన్నారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను అధికారులు సమావేశంలో వివరించారు. ఇళ్లు, పనిచేసే ప్రాంతాలు, ప్రయాణాల్లో మహిళల భద్రతకు సంబంధించి ఉపసంఘాలు ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారుల ప్రతిపాదనలను అంగీకరించిన సీఎస్ సోమేశ్ కుమార్... తగు ప్రతిపాదనలతో రావాలని సూచించారు.