తెలంగాణ

telangana

ETV Bharat / state

కొవాగ్జిన్‌ రెండో దశ పరీక్షలు షురూ.. నిమ్స్‌లో 12 మందికి టీకా!

నిమ్స్‌లో కొవాగ్జిన్‌ క్లినికల్‌ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. రెండో దశలో భాగంగా మంగళవారం 12 మంది వాలంటీర్లకు టీకాలు వేశారు. రెండో దశ ప్రక్రియ పూర్తయ్యేందుకు దాదాపు నెలన్నర సమయం పడుతుందని ఉన్నతాధికారులు వెల్లడించారు.

The second phase of co vaccine testing has begun in Nims
కొవాగ్జిన్‌ రెండో దశ పరీక్షలు షురూ.. నిమ్స్‌లో 12 మందికి టీకా!

By

Published : Sep 9, 2020, 6:55 AM IST

కరోనా మహమ్మారి కట్టడికి భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ రూపొందించిన కొవాగ్జిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ నిమ్స్‌లో చురుగ్గా కొనసాగుతున్నాయి. రెండో దశలో భాగంగా మంగళవారం 12 మంది వాలంటీర్లకు టీకాలు వేశారు. వీరందర్నీ నాలుగు గంటలపాటు పర్యవేక్షణలో ఉంచిన వైద్యులు అనంతరం ఇంటికి పంపారు. మొత్తం 50 మందిపై రెండో దశ పరీక్షలు నిర్వహించనున్నారు.

విడతల వారీగా ఈ కార్యక్రమం పూర్తికానుంది. ‘అనంతరం వారి నుంచి రక్త నమూనాలు సేకరించి పుణే జాతీయ వైరాలజీ ల్యాబ్‌తోపాటు ఐసీఎంఆర్‌కు పంపుతాం. రెండో దశ ప్రక్రియ పూర్తయ్యేందుకు దాదాపు నెలన్నర సమయం పడుతుందని భావిస్తున్నాం’ అని ఓ ఉన్నతాధికారి తెలిపారు. తొలి దశ క్లినికల్‌ పరీక్షలు ఆశాజనంగా ఉన్నాయన్నారు. ఒకటి, రెండు దశలకు సంబంధించి పర్యవేక్షణ కొనసాగిస్తూనే మూడో దశకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వివరించారు.

ఇదీ చూడండి:గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో కరోనా ఉద్ధృతం

ABOUT THE AUTHOR

...view details