జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారానికి సంబంధించి తీసుకోవాల్సిన అనుమతులు, పాటించాల్సిన విధానాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టతనిచ్చింది. ప్రచారం కోసం అభ్యర్థులు సంబంధిత డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ నుంచి, స్టార్ క్యాంపెయినర్లు జీహెచ్ఎంసీ కమిషనర్ నుంచి వాహనాలకు ముందస్తు అనుమతి తీసుకోవాలని ఎస్ఈసీ తెలిపింది. లేదంటే అనధికార వాహనాలుగా పరిగణించి జప్తు చేయడంతో పాటు సంబంధిత అభ్యర్థులు చట్ట ప్రకారం శిక్షకు గురవుతారని స్పష్టం చేసింది. పోలింగ్ రోజు అభ్యర్థికి ఒకే వాహనానికి విడిగా అనుమతి ఇస్తామని పేర్కొంది. ట్రాఫిక్ సమస్యలు, ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని.. ప్రచారానికి అనుమతించే వాహనాల సంఖ్యపై సంబంధిత అధికారి నిర్ణయం తీసుకుంటారని ఎన్నికల సంఘం పేర్కొంది.
రెండుకు మించి వాహనాలు వరుసగా వెళ్లరాదు