ప్రపంచకప్‌కు సర్ఫరాజే కెప్టెన్: పీసీబీ
పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా సర్పరాజ్ కొనసాగుతాడని పీసీబీ ప్రకటించింది. తన కెప్టెన్స్‌పై తమకు ఎలాంటి సందేహం లేదని.. త్వరలో ప్రారంభమయ్యే ప్రపంచకప్‌కు సర్ఫరాజే సారథ్యం వహిస్తాడని పీసీబీ ఛైర్మన్ ఎహ్సాన్ మని స్పష్టం చేశారు.

సర్ఫరాజ్‌పై నిషేధం తర్వాత షోయబ్ మాలిక్‌ను కెప్టెన్‌గా ప్రకటిస్తారన్న వార్తలను పీసీబీ ఖండించింది. పాకిస్థాన్ సూపర్ లీగ్ తర్వాత కెప్టెన్ పై నిర్ణయం ప్రకటిస్తామని మని తెలిపారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మిగిలిన వన్డే, టీ20 సిరీస్‌కు మాలిక్ సారథ్యం వహించనున్నాడు.
అండర్-19 ప్రపంచ కప్ నుంచి సర్ఫరాజ్ మంచి ప్రదర్శన కనబర్చాడని అతని సారథ్యంలో జట్టు బలంగా మారిందని మని అన్నారు. క్రికెటర్‌తో పాటు మంచి వ్యూహకర్త అని ప్రశంసించారు. సర్ఫరాజ్ కెప్టెన్సీలో జట్టు ఛాంపియన్ ట్రోఫీతో పాటు టీ20ల్లో నంబర్ వన్ ర్యాంకుకు చేరిందని గుర్తుచేశారు.
దక్షిణాఫ్రికా క్రికెటక్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఘటనలో ఐసీసీ సర్ఫరజ్పై నాలుగు వన్డేల నిషేధం విధించిన సంగతి తెలిసిందే.