తెలంగాణ

telangana

ETV Bharat / state

'మహిళలు పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు'

ఆరోగ్య పరిరక్షణ కోసం మహిళలు ఇంటా బయటా పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని జీహెచ్‌ఎంసీ ఉప కమిషనర్ సంధ్య తెలిపారు. నాబార్డ్ సౌజన్యంతో చిరు ప్రయత్నం గొప్ప ప్రగతి పేరిట అభివృద్ధి కోసం పారిశుద్ధ్యం అనే నినాదం విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.

'మహిళలు పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు'
'మహిళలు పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు'

By

Published : Oct 2, 2020, 4:03 PM IST

కొవిడ్-19 నేపథ్యంలో ఆరోగ్య పరిరక్షణ కోసం మహిళలు ఇంటా బయటా పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని జీహెచ్‌ఎంసీ ఉప కమిషనర్ సంధ్య తెలిపారు. మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలను పురస్కరించుకుని హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌ నాబార్డ్ ప్రాంతీయ కార్యాలయంలో పారిశుద్ధ్య అవగాహన ప్రచార కార్యక్రమం - 2020ను ఆమె ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో నాబార్డ్ సీజీఎం వైకే రావు, జనరల్ మేనేజర్లు మురళి మిశ్రా, అబ్బూరి సుబ్బారావు, ఉషా, ఇతర అధికారులు పాల్గొన్నారు. జీహెచ్‌ఎంసీ సహా చుట్టు పక్కల గ్రామాల నుంచి స్వయం సహాయక మహిళా బృందాల సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ప్రధాని నరేంద్రమోదీ అంకురార్పణ చేసిన ప్రతిష్ఠాత్మక స్వచ్ఛ్ భారత్ మిషన్‌లో భాగంగా గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాల్లో స్వచ్ఛత ఉద్యమం, పారిశుద్ధ్యంపై మహిళల్లో అవగాహన కల్పన వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. నాబార్డ్ సౌజన్యంతో చిరు ప్రయత్నం గొప్ప ప్రగతి పేరిట అభివృద్ధి కోసం పారిశుద్ధ్యం అనే నినాదం విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని సంధ్య సూచించారు.

స్వచ్ఛ్ భారత్ మిషన్‌లో భాగంగా రాష్ట్రంలో 100 గ్రామాలను తాము దత్తత తీసుకుని పారిశుద్ధ్యం, ఆరోగ్యంపై పెద్ద ఎత్తున అవగాహన కల్పించబోతున్నామని నాబార్డ్ సీజీఎం వైకే రావు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు తమ ఇళ్లు శుభ్రంగా ఉంచుకుంటే చాలా వరకు అంటువ్యాధులకు దూరంగా ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details