తెలంగాణ

telangana

ETV Bharat / state

Environmental Day: చెట్లను రక్షిద్దామంటూ సైకత శిల్పం - sand art

పర్యావరణాన్ని రక్షిస్తూ.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలంటూ ఇద్దరు యువతులు సైకత శిల్పాన్ని రూపొందించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో దీనిని తీర్చిదిద్దారు.

sand-art-in-the-eve-of-world-environmental-day-at-east-godavari
చెట్లను రక్షిద్దామంటూ సైకత శిల్పం

By

Published : Jun 5, 2021, 12:57 PM IST

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని(World Environmental Day) పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్​లోని తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో సైకత శిల్పి.. దేవిన శ్రీనివాస్ కుమార్తెలు సోహిత, ధన్యతలు సైకత శిల్పాన్ని రూపొందించారు. చెట్లను కాపాడాలనే నినాదంతో.. కరోనా నుంచి భద్రతకావాలంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలనే సందేశాన్నిస్తూ దానిని తీర్చిదిద్దారు.

చెట్లను రక్షిస్తే.. పర్యావరణాన్ని రక్షించినట్టేనంటూ సందేశాన్నిస్తూ రెండు చేతులతో చెట్టును, భూమిని ఒడిసి పట్టుకొని కాపాడుతున్నట్టుగా సైకత శిల్పాన్ని(sand art) రూపొందించారు. అందరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.

ఇవీ చదవండి:పుడమికి పునరుజ్జీవం జీవజాలానికి అభయం

ABOUT THE AUTHOR

...view details